చైన్నై చంద్రం సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన సినిమాలతోనే కాకుండా, ఫ్యామిలీ, ఆనారోగ్య సమస్యల కారణంగానూ హాట్‌టాపిక్‌గా మారింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మయోసైటిస్ వల్ల ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కథలను తిరిగి వింటోంది. ఇక.. లేటెస్ట్‌గా ఫొటో షూట్‌లతో మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇలాంటి టైమ్‌లో సమంతకు చెందిన మరొక న్యూస్ వైరల్‌గా మారింది. సామ్ గురించి హీరో సిద్ధార్థ్ (Siddharth) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.
నాగ చైతన్యను (Naga Chaitanya) వివాహం చేసుకోకముందు సమంత (Samantha) సిద్ధార్థ్ తో ప్రేమలో మునిగింది. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే… మనస్పర్థల కారణంగా వీళ్లిద్దరి మధ్య లవ్ బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత సామ్.. చైతూతో ప్రేమలో విహరించడం. పెళ్లితో ఒక్కటవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. సమంతకు పెళ్లయిన తర్వాత సిద్ధార్థ్ కూడా వేరే అమ్మాయిలను ప్రేమించాడు. తర్వాత ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే… రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ సామ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రెండు సార్లు సిద్ధార్థ్.. సమంత పేరు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో. సిద్ధూ సామ్‌ని మర్చిపోలేకపోతున్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇంతకీ సామ్ గురించి సిద్ధూ ఏం కామెంట్ చేశాడంటే.. మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని యాంకర్ సిద్ధార్థ ను అడిగితే వెంటనే సమంత అని చెప్పాడు. మిస్ పర్ఫెక్ట్ ఎవరు అని యాంకర్ మరో ప్రశ్న అడగ్గా.. అప్పుడు కూడా సమంత అనే ఆన్సరిచ్చాడు. ప్రస్తుతం సమంతపై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. వీళ్లిద్దరూ మళ్లీ కలవబోతున్నారంటూ ఒక వార్త వైరల్‌గా మారిపోయింది. అయితే.. సమంత తిరిగి సిద్ధార్థ్ తో కలిసే ప్రసక్తే ఉండదని సామ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే.. మరీ మాజీ ప్రియుడి కామెంట్లపై సమంత ఎలా రియాక్ట్ అవబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.