SINGER CHITRA: అయోధ్యపై సింగర్ చిత్ర పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వివాదం..

ప్రముఖ గాయని చిత్ర కూడా.. రామాలయంపై ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అనేక భాషల్లో దాదాపు 25వేలకు పైగా పాటలు పాడిన చిత్ర.. అయోధ్య గురించి మాట్లాడిన రెండు మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపాయ్.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 04:47 PM IST

SINGER CHITRA: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ అద్భుత క్షణం కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తోంది. త్రేతాయుగంలో రాములోరి పట్టాభిషేకం జరిగిన తీరులో.. కలియుగంలో మరోసారి ఆ రామయ్య అయోధ్యలో కొలువు దీరనున్నాడు. ఈ మహత్తర కార్యానికి వేలాది మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. దీంతో అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

YS SHARMILA: పెద్ద ప్లానే.. ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ తెలిస్తే షాక్.. షర్మిలతో మాములు గేమ్ కాదుగా..

ఇక అటు పలువురు వీఐపీలు అయోధ్యకు సంబంధించి సందేశాలు ఇస్తున్నారు. ప్రముఖ గాయని చిత్ర కూడా.. రామాలయంపై ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అనేక భాషల్లో దాదాపు 25వేలకు పైగా పాటలు పాడిన చిత్ర.. అయోధ్య గురించి మాట్లాడిన రెండు మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపాయ్. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సమయంలో.. జనాలు రాముడి శ్లోకాలు జపించాలని ఓ ట్వీట్‌ చేసింది చిత్ర. సోషల్ మీడియా వేదికగా దీని గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రతీ ఒక్కరూ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు.. శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని జపించండి.. అదే రోజు సాయంత్రం ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించండి.. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసింది చిత్ర. దీనిపై ఓ వర్గం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిత్ర వీడియోపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా.. రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఆమెకు మద్దతుగా మరో గాయకుడు వేణుగోపాల్ నిలబడ్డారు. అలానే మరో వర్గం కూడా చిత్రకు మద్దతుగా నిలిచింది. ఆమె తన భావాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఇలాంటి వివాదం ఇప్పుడేం కొత్త కాదు. త్రిసూర్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి శోభన.. ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడాన్ని కూడా ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు మళ్లీ చిత్ర వంతు వచ్చినట్లు అయింది.