మూడో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. 6 పరుగుల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి సెషన్ లో భారత్ చేసిన ప్రయోగం తీవ్ర విమర్శలకు దారితీసింది. పిచ్ స్పిన్ కు సహకరిస్తుంటే వైట్ వాచ్ మన్ గా మహ్మద్ సిరాజ్ ను పంపించింది. అజీజ్ పటేల్ బౌలింగ్ లో సిరాజ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్‌కు బదులు అశ్విన్‌ను లేదా కోహ్లీని పంపించినా పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సిరాజ్ గోల్డెన్ డకౌటవ్వడం వల్ల టీమిండియా బ్యాటర్లపై అనవసర ఒత్తిడి పడిందంటున్నారు. సిరాజ్ గోల్డెన్ డకౌట్‌పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇదేం స్ట్రాటజీ గంభీర్ అంటూ మండిపడుతున్నారు. అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కంటే సిరాజ్ గొప్పగా బ్యాటింగ్ చేస్తాడా అంటూ ప్రశ్నిస్తున్నారు.