సిరాజ్ ఓవరాక్షన్ వద్దు, బౌలింగ్ పై ఫోకస్ పెట్టు

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంటే మామూలు విషయం కాదు.. కంగారూలను వారి సొంతగడ్డపై నిలువరించడం అంత ఈజీ కాదు.. కానీ ఈ అరుదైన ఫీట్ ను టీమిండియా వరుసగా రెండుసార్లు సాధించింది. గత పర్యటనలో పలువురు సీనియర్ ఆటగాళ్ళు లేకున్నా యువ జట్టుతోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 02:16 PM IST

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంటే మామూలు విషయం కాదు.. కంగారూలను వారి సొంతగడ్డపై నిలువరించడం అంత ఈజీ కాదు.. కానీ ఈ అరుదైన ఫీట్ ను టీమిండియా వరుసగా రెండుసార్లు సాధించింది. గత పర్యటనలో పలువురు సీనియర్ ఆటగాళ్ళు లేకున్నా యువ జట్టుతోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. అప్పుడు 3 మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. అయితే సిరాజ్ మ్యాజిక్ ఇప్పుడు కనిపించడం లేదు. నిజానికి గత కొంతకాలంగా సిరాజ్ బౌలింగ్ లో పస తగ్గినట్టు కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. వికెట్లు తీయడం అటుంచితే పరుగులను కూడా కట్టడి చేయలేకపోతున్నాడు. అదే సమయంలో అతిగా రియాక్ట్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.

అడిలైడ్ టెస్టులో హెడ్ ను ఔట్ చేసి అతిగా సంబరాలు చేసుకోవడంపై విమర్శల పాలయ్యాడు. ఇలాంటి ఓవరాక్షన్ తో బౌలింగ్ పై ఫోకస్ తగ్గుతుందన్నది మాజీల అభిప్రాయం. ఇప్పుడు గబ్బా టెస్టులోనూ సిరాజ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఒకవైపు బూమ్రా వికెట్లు తీస్తున్నా మరోఎండ్ నుంచి సిరాజ్ విఫలమయ్యాడు. కనీసం ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. అనవసర విషయాల్లో ఎక్కువగా రియాక్ట్ కాకుండా బౌలింగ్ పై మరింత ఫోకస్ పెట్టాలని పలువురు మాజీలు సిరాజ్ కు సూచిస్తున్నారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ సైతం మిగిలిన బౌలర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతీసారీ బూమ్రా ఒక్కడితోనే గెలవలేమని, మిగిలిన బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలని రోహిత్ వ్యాఖ్యానించాడు. సిరాజ్ తన పేస్ పై మరింత ఫోకస్ పెట్టకుంటే కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బౌలింగ్ లో వేరియేషన్ కూడా చూపించలేకపోతున్న ఈ హైదరాబాదీ పేసర్ మిగిలిన టెస్టుల్లోనైనా గాడిన పడతాడేమో చూడాలి.