మియాకు చిర్రెత్తింది, లబూషేన్ పై బాల్ విసిరిన సిరాజ్

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో అత‌ను బౌలింగ్ వేసే స‌మ‌యంలో బంతిని వికెట్ల మీద‌కు విసిరేశాడు.

  • Written By:
  • Publish Date - December 7, 2024 / 12:51 PM IST

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో అత‌ను బౌలింగ్ వేసే స‌మ‌యంలో బంతిని వికెట్ల మీద‌కు విసిరేశాడు. ఆస్ట్రేలియా 25వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఫ‌స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా .. ధీటుగా ఆడుతోంది. ల‌బుషేన్‌, మెక్‌స్వీనేలు.. భారత బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే 25వ ఓవ‌ర్‌ లో సిరాజ్ బాల్ వేసే సమయానికి లబూషేన్ పక్కకు తప్పుకున్నాడు. అయితే అదే ర‌న‌ప్‌తో వ‌చ్చిన సిరాజ్ త‌న చేతుల్లోని బంతిని వికెట్ల మీద‌కు కోపంతో విసిరేశాడు. సైట్ స్క్రీన్ వ‌ద్ద ఓ ప్రేక్ష‌కుడు క‌ద‌ల‌డం వ‌ల్ల ల‌బుషేన్ క్రీజ్ నుంచి ప‌క్క‌కు జ‌రిగాడు. కానీ ఇది తెలుసుకోకుండానే సిరాజ్ త‌న టెంప‌ర్‌ను కోల్పోయాడు.