ప్రకృతి ప్రకోపం (Kerala Deluge) తో.. కేరళలోని వాయనాడ్ (Wayanad) అల్లాడిపోతోంది. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు.. పిల్లలను జాడ తెలియక అల్లాడుతున్న తల్లులు.. ఏ తల్లిని కదిలించినా ఆగని కన్నీళ్లు.. వాయనాడ్ ఘటన కళ్ల ముందు కదిలితే చాలు మనసు మెలేసినట్లు అవుతోంది ప్రతీ ఒక్కరికి ! కోలుకో వాయనాడ్ అని దేశవ్యాప్తంగా జనాలు, సెలబ్రిటీలు (Celebrities) పిలుపునిస్తున్నారు. వాయనాడ్ విలయంలో ఇప్పటివరకు 4వందల మందికి ప్రాణాలు వదిలారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతోంది. శవాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయ్. సహాయ చర్యల్లో భాగంగా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఐతే అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు.
ఇది కూడా చదవండి : Wayanad : వాయనాడ్ లో సినిమా సీన్, ఆరుగురు ప్రాణాలు కాపాడటం కోసం…
కొండ చరియలు (Landslides) విరిగిపడిన ఘటన జరిగి ఐదు రోజులు దాటుతున్నా.. వాయనాడ్ నేల ఇంకా బురదగానే ఉంది. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ మహిళ చేసిన సాహసం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె ఆ పని చేయకపోతే.. విలయం ఇంకెలా ఉండేదో తలుచుకుంటేనే భయం అవుతోంది.. ఆమే సీతా షెల్కే.. వాయనాడ్ బాధితులను కాపాడటంలో శివంగిలా దూకారు. అమ్మవారిలా కనిపించారు. అతి తక్కువ సమయంలో 190అడుగుల పొవైన బ్రిడ్జ్ నిర్మించి మేజర్ సీతా (Major Sita) షెల్కే రికార్డ్ క్రియేట్ చేసారు. రెస్క్యూ టీమ్ వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఇలాంటి వారికి సాయం చేసేందుకు పట్టుదలతో కష్టపడి.. గంటల వ్యవధిలోనే 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించారు.
ఇది కూడా చదవండి : Kerala, Wayanad : కేరళలో శవాల కుప్పలు.. 200 దాటిన మృ*తుల సంఖ్య
సీతా చేసిన ఈ పనితో.. సహాయచర్యలు కొనసాగించడం కాస్త ఈజీ అయింది. లేదంటే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సీతా షెల్కే సేవలకు ఇప్పుడు ప్రతీ ఒక్కరు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ (Indian Army) మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ (Madras Group of Engineers) లో సీతా షెల్కే విధులు నిర్వహిస్తున్నారు. ఈమెతో పాటు మేజర్ అనీశ్ (Major Anish) ఆధ్వర్యంలోని బృందం… వాయనాడ్‌లో తీవ్రంగా కృషి చేస్తోంది. వయనాడ్ ప్రాంతంలో కేవలం 16గంటల్లోనే 24టన్నుల సామర్థ్యంతో 190అడుగల పొడవైన వంతెనను ఈ బృందం నిర్మించింది. వంతెన నిర్మాణం జులై 31న రాత్రి స్టార్ట్ చేసి.. ఆగష్టు 1 సాయంత్రానికి పూర్తి చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం (Bridge construction) పూర్తి చేయడానికి మేజర్ సీతా షెల్కే (Major Sita Shelke) నాయకత్వంలోని సభ్యులు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణం ద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభ కావడంతో పాటు, వేగంగా జరుగుతోంది. 2018 కేరళ వరదల సమయంలోనూ.. సీతా షెల్కే ఆధ్వర్యంలోని బృందం యాక్టివ్‌గా పనిచేసింది. ఎన్నో వందల ప్రాణాలు కాపాడింది.
ఇది కూడా చదవండి : Kedarnath Yatra : కేదార్ నాథ్ లో రెడ్ అలర్ట్.. కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత.. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు