CM Revanth Reddy : కాంగ్రెస్ లోకి సిట్టింగ్ MP,MLA.. మేం గేట్లు తెరిచాం.. ఓ ఎంపీ.. ఎమ్మెల్యే గేటు దాటారు.. మరో 4 MLA లు పక్క

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ చేవేళ్లే (Chevelle) ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. ఇదే విషయాన్ని రంజిత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు.

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ చేవేళ్లే (Chevelle) ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. ఇదే విషయాన్ని రంజిత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. ‘ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ పార్టీ అధినేతను రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.

మరో వైపు ఇటివలే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు.. దీంతో ఆయనకు కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఇదే విషయంపై కాసేపటి క్రితమే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి… ఈ చేరికలపై ప్రస్తావించారు. గేట్లు తెరిచామాని.. ఓ ఎంపీ.. ఎమ్మెల్యే గేటు దాటారు అని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా.. రంజిత్ రెడ్డికి చెవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..

దీంతో కాంగ్రెస్ పార్టీలోకి మరో 4గు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నట్లు సమాచారం…
గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదో ఒక సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తు వస్తున్నారు. అలా కలిసిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో నేడు చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మరిన్ని వలసలు ఉంటాయని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు. నేను ఈరోజు ఉదయం ఒక గేటు తెరిచాను.. అందులో ఇద్దరు గేట్ దాటారు.. మరిన్ని గేట్లు కూడా తెరుస్తాను అంటూ చెప్పుకోచ్చారు. నిన్న సాయంత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. పీసీసీ చీఫ్ గా ఇవాళ్టి నుంచే తన పని మొదలు పెట్టానని రేవంత్ హాట్‌ కామెంట్స్‌ చేశారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌.. కాలే యాదయ్య, సునీతా, లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంను కలిసిన వారిలో ఎవరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు చేరుతారనే ఉత్కంఠ మొదలైంది.