Sivaramaraju Vetukuri‎: ఉండిలో టీడీపీకి ఝలక్.. రెబల్‌గా బరిలోకి దిగనున్న కలవపూడి శివ

టీడీపీ టికెట్ వస్తుందని భావించి, కలువపూడి శివ భంగపడ్డారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసే యోచనలో కలువపూడి శివ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రామరాజుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదన్నారు.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 05:23 PM IST

Sivaramaraju Vetukuri‎: టీడీపీకి కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో ఆగ్రహజ్వాలలు ర‌గులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అలియాస్ కలవపూడి శివను కదని రామరాజుకు టీడీపీ సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంటోంది. ఆత్మ‌గౌరవం లేని పార్టీలో తమకి చోటు లేద‌ని కార్య‌కర్త‌లు ఆవేద‌న చెందుతున్నారు. టిడిపి కంచుకోటను బ‌ద్ద‌లు కొట్టి చూపిస్తామ‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. శివ‌లేని లోటును టిడిపికి చూపిస్తామంటున్నారు.

500 Gas Cylinder Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీడీపీ టికెట్ వస్తుందని భావించి, కలువపూడి శివ భంగపడ్డారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసే యోచనలో కలువపూడి శివ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపై క‌ల‌వ‌పూడి శివ‌రామ‌రాజు మీడియాతో మాట్లాడారు. “ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు డబ్బు, అహంకారంతో ఉన్నాడు. నియోజకవర్గంలో నా పేరు ఉచ్చరిస్తున్న నా అభిమానులకు ఎమ్మెల్యే రామరాజు వార్నింగ్ ఇస్తున్నాడు. నియోజకవర్గంలో జరిగిన టిడిపి- జనసేన ఆత్మీయ సమావేశానికి నాకు పిలుపు లేదు. రేపు తాడేపల్లిగూడెంలో జరిగే సభకు కూడా నాకు పిలుపు లేదు. ఎమ్మెల్యే రామరాజు నిత్యం నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రామరాజుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదు. ఉండి నియోజకవర్గంలో, 2024 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను. నా హృద‌యంలో అగ్నిగోళంలా మండుతుంది. పైకి చెప్పుకోలేక‌పోతున్నాను. నేను ఉండి ఎమ్మెల్యే సింటింగ్ అభ్య‌ర్థిని. టికెట్ ఇవ్వ‌లేన‌ప్పుడు క‌నీసం పార్టీ న‌న్ను సంప్ర‌దించ‌లేదు.

ప్ర‌జ‌లు నన్ను కోరుకుంటున్నారు. ప్ర‌జాశీస్సులు ఉన్నాయి. పార్టీ కేడర్, ఆక్వారైతులు నన్ను కోరుకుంటున్నారు. ప్ర‌జ‌ల నుంచి పెద్దఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఉండి నియోజ‌క‌ర్గం ప్ర‌జామ‌ద్ద‌తు ఎలా ఉంటుందో చూపిస్తా” అంటూ క‌ల‌వ‌పూడి శివ‌ వ్యాఖ్యానించారు. 2009, 2014 లో వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన శివను 2019లో అప్పటి రాజ‌కీయ స‌మీక‌రణాల నేపథ్యంలో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేయించింది టీడీపీ. ఈ ఎన్నికలో ఆ‍యన స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ టిక్కెట్ దక్కకపోయినా పోటీలో ఉంటానంటున్నాడు.