లక్ష్యం… ఆత్మ విశ్వాసం… స్మార్ట్ వర్క్ ఉంటే ఎంత పెద్ద పని అయినా ఈజీగా సాధించవచ్చు అంటున్నారు IAS అధికారి స్మితా సభర్వాల్… ఆమె గురించి… రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. బీఆర్ఎస్ హయాంలో CMO కార్యదర్శిగా పనిచేశారు. గత పదేళ్ళుగా ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలను నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించారు.
సోషల్ మీడియాలోనూ స్మితా సబర్వాల్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో సంచలనం కలిగించిన సంఘటనల గురించి రెస్పాండ్ అవుతారు. అలాగే తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ట్విట్టర్, ఇన్ స్టాలో పంచుకుంటారామె. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారనీ… అప్లయ్ కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదనీ… తాను తెలంగాణలోనే పనిచేస్తానని సోషల్ మీడియాలోనే ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వెకేషన్, హాలీడే ట్రిప్ ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటారు స్మితా సబర్వాల్. లేటెస్ట్ గా ఆమె పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్య రిలీజ్ అయిన 12th ఫెయిల్ సినిమా చాలామందికి ప్రేరణ కలిగించింది. ఈ సినిమా ఓ బయోపిక్. ముంబై అడిషనల్ కమిషన్ మనోజ్ జీవితం ఆధారంగా మూవీని తీశారు. మనోజ్ రూమ్మేట్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు.
ఈ మూవీ స్మితా సబర్వాల్ కి కూడా మంచి inspiration గా నిలిచిందట. తనకు 12th Class Y మధురమైన జ్ఞాపకమని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. తన ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాను కూడా X లో షేర్ చేశారు. ‘నా 12వ తరగతి ఫలితాలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. పెద్ద పెద్ద కలలను, లక్ష్యాలను కనేలా ప్రేరేపించాయి. జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కఠినమైన పరీక్షల్లో UPSC ఒకటి. సివిల్స్ కోసం సిద్ధమయ్యే వారికి కష్టపడేతత్వం, స్మార్ట్ వర్క్ చాలా అవసరం అని స్మితా సభర్వాల్ X లో రాశారు. తనకు 12th క్లాసులో 461 మార్కులు వచ్చిన మెమోను కూడా ఆమె షేర్ చేశారు. స్మితా సభర్వాల్ చదివిన కాలేజీ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఆమె సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో 12th క్లాస్ చదివారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 90 శాతానికి తక్కువ కాకుండా మార్కులు సాధించారు స్మితా సబర్వాల్. స్మిత సబర్వాల్ పోస్టుపై నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తమకు మోటివేషన్ గా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఆ రోజులు మధురమైన జ్ఞాపకాలు అని కొందరు అంటే… UPSC కొట్టడానికి స్మార్ట్ వర్క్, డెడికేషన్ తో పాటు లక్కు కూడా ఉండాలని కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి స్మితా సబర్వాల్ 12TH క్లాస్ మార్కుల మెమో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.