Smita Sabharwal: టార్గెట్ స్మిత సబర్వాల్.. ఆమె లెటర్ ఎందుకు రాశారు..?

కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే అంశంపై డిసెంబర్ 1 నాడు స్మితా రాసిన లెటర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవనెత్తారు. అప్పట్లో మీరు చెబితేనే ఆమె లెటర్ రాశారనీ.. ఇప్పుడు ఎందుకు రివర్స్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

  • Written By:
  • Updated On - February 12, 2024 / 05:46 PM IST

Smita Sabharwal: తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో CM కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌పై అసెంబ్లీలో రచ్చ జరిగింది. కేసీఆర్ హయాంలో పనిచేసినప్పుడు ఆమె రాసిన లెటర్‌పై మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే అంశంపై డిసెంబర్ 1 నాడు స్మితా రాసిన లెటర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవనెత్తారు. అప్పట్లో మీరు చెబితేనే ఆమె లెటర్ రాశారనీ.. ఇప్పుడు ఎందుకు రివర్స్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

TS ASSEMBLY : కలసి బిర్యానీ తిని… తెలంగాణకు అన్యాయం – కేసీఆర్-జగన్ దోస్తీపై ఉత్తమ్ ఫైర్

అయితే స్మిత రాసిన లెటర్‌ను సగమే చదువుతున్నారనీ.. ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై మాత్రమే ఆమె లెటర్ రాశారనీ.. ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లెటర్ కూడా అదే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను బ్లేమ్ చేస్తుందా అని ప్రశ్నించారు హరీష్. అయితే, తాము అధికారులను తప్పుబట్టడం లేదనీ.. మీరు చెప్పినట్టే స్మితా సబర్వాల్ లెటర్ రాశారంటూ హరీష్ మాటలను ఖండించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని.. స్మితా రాసిన లెటర్‌కు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలుపుతూ స్మిత సబర్వాల్ ఎలా లేఖ రాశారని అన్నారు. ప్రాజెక్టులను అప్పగించాలని ఆమెకు ఎవరు చెప్పారో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను అప్పగించడానికి ఆలస్యమైంది అని చెప్పారే తప్ప.. వ్యతిరేకించడం లేదని ఎందుకు లెటర్ రాయలేదని ప్రశ్నించారు రేవంత్.

ఇన్నాళ్ళు స్మిత రాసిన లెటర్‌ను మీరు ఎందుకు బయటపెట్టలేదని, మంత్రి ఉత్తమ్ చెప్పిన తర్వాత కూడా లెటర్ రాసింది నిజమేనని ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. మాజీ ENC మురళీధర్ రావుపైనా అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. రిటైర్డ్ అయిన వ్యక్తిని కొనసాగించారనీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన్ని బీఆర్ఎస్ లీడర్లు వెనక నుంచి నడిపించారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మీ ఏజెంట్‌తో మాట్లాడించి.. మళ్ళీ సభలోకి వచ్చినా ఆయన మాటలే ఇక్కడ చెబుతున్నారని హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. మీ ఏజెంట్లు చాలా మంది ఉన్నారనీ.. వాళ్ళందర్నీ బయటకు లాగుతామన్నారు డిప్యూటీ సీఎం.