Smita Sabharwal: తొలిసారి రేవంత్‌ను కలిసిన స్మితా.. ఎందుకంటే..

సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అందరు ఐఏఎస్‌లు వరుసపెట్టి ఆయనను కలిశారు కానీ.. స్మిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె హస్తినకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా ! ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా సెక్రటేరియట్‌లో కనిపించారు.

  • Written By:
  • Updated On - March 1, 2024 / 03:36 PM IST

Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారంలో.. సరిగ్గా నెల కింద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కేడర్ మార్చుకుంటారని.. ఢిల్లీకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అందరు ఐఏఎస్‌లు వరుసపెట్టి ఆయనను కలిశారు కానీ.. స్మిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె హస్తినకు వెళ్లడం ఖాయం అనుకున్నారంతా !

GANTA VS BOTSA: నిను వీడని నీడను నేనే.. గంటాను వదలని బొత్సా.. భీమిలీకి షిప్ట్ తో పరేషాన్

ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా సెక్రటేరియట్‌లో కనిపించారు. మంత్రి సీతక్కతో మాట కలిపారు. ఐతే ఆ తర్వాత ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసిన రేవంత్ సర్కార్‌.. ఆ లిస్ట్‌లో స్మితా పేరు కూడా చేర్చింది. ఎలాంటి ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితాను నియమించింది. ఇక ఆ తర్వాత.. స్మితా పేరు చుట్టూ అసెంబ్లీ వేదికగా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య యుద్ధం జరిగింది. ఐతే ఇప్పుడు ఆమె పేరు మళ్లీ చర్చకు వచ్చింది. ఫైనాన్స్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రేవంత్‌ను మొదటిసారి కలిశారు స్మితా సబర్వాల్‌. సీఎం ఇంటికి వెళ్లి మరీ.. భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోను స్మితా షేర్ చేశారు. స్మితాతో పాటు.. స్టేట్‌ ఫైనాన్స్ కమిషన్‌ చైర్మన్‌, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. గతంలో సీఎంవోలో కీలకంగా వ్యవహించిన స్మితాతో.. సీఎం రేవంత్‌ కీలక అంశాలు చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఫైనాన్స్ కమిషన్‌ బలోపేతం చేయడంతో పాటు.. కొత్త ప్రణాళికల మీద కూడా ముఖ్యమంత్రితో స్మితా అండ్ టీమ్ చర్చించినట్లు తెలుస్తోంది. స్మితా వ్యవహారంలో.. కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ భేటీ జరగడం ఆసక్తి రేపుతోంది.