Smita Sabharwal: గుర్తుకొస్తున్నాయ్‌.. చిన్నప్పటి ఫొటో షేర్‌ చేసిన స్మితా.. ఎంత ముద్దుగా ఉందో..

ట్విట్టర్ వేదికగా.. స్మితా పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తల్లి పురబి దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా స్మితా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసి తన కంటే దృఢ నిశ్చయం కలిగిన మహిళ ఎవరైనా ఉన్నారంటే.. అది తన తల్లేనని రాసుకొచ్చారు.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 05:44 PM IST

Smita Sabharwal: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారాక ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లాలని అనుకున్నారని జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే తాను తెలంగాణ సర్వీసులోనే కొనసాగుతానని ఒక ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన స్మిత.. తన చుట్టూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Nayanthara: నయనతారకు షాక్.. ఓటీటీ నుంచి అన్నపూరణి చిత్రం తొలగింపు..

రాష్ట్రంలో సర్పంచ్‌లకు ఎలాంటి అనుమానాలు ఉన్నా.. తెలంగాణ ఆర్థిక సంఘం కార్యాలయానికి రావాలంటూ.. అక్కడ జరిపిన పూజ ఫొటోలు షేర్‌ చేశారు స్మితా. ఐతే అంతకుముందు ట్విట్టర్ వేదికగా.. స్మితా పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తల్లి పురబి దాస్ పుట్టినరోజు సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా స్మితా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసి తన కంటే దృఢ నిశ్చయం కలిగిన మహిళ ఎవరైనా ఉన్నారంటే.. అది తన తల్లేనని రాసుకొచ్చారు. నువ్వు కూడా ట్విట్టర్‌లో ఉన్నావని తెలుసు.. నన్ను రహస్యంగా ఫాలో అవుతున్నావని కూడా తెలుసు అంటూ తన తల్లిని ఉద్దేశించి ట్వీట్ చేశారు స్మితా. ఐతే ఈ ఈ ట్వీట్‌కు తన తల్లి ఫొటోతో పాటు.. తన చిన్నప్పటి ఫొటోను కూడా స్మితా షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. స్మితా సబర్వాల్ తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు మాత్రం.. ఫొటోలో ఉన్న చిన్నారి స్మితా సబర్వాల్ గురించి కామెంట్లు పెట్టారు.

చిన్నారి స్మితా సబర్వాల్ చాలా ముద్దుగా ఉందని.. క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేశారు. కామెంంట్లు పెట్టే వాళ్లు కొందరయితే.. వాటిని షేర్ చేసే వాళ్లు ఇంకొందరు. ఇక అటు స్మితా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తుంటారు. చేనేత వస్త్రాలను విపరీతంగా ఇష్టపడే స్మితా.. వాటిని ప్రదర్శించిన రకరకాల ఫొటోలు షేర్ చేస్తుంటారు. తాను.. వీకెండ్స్‌లో వెళ్లే టూర్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు.