ఐసీసీ వన్డే,టీ20 ర్యాంకింగ్స్, టాప్ 3లో స్మృతి మంధన

మహిళల ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ రెండింటిలోనూ మంధన టాప్‌-3లోకి దూసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 06:45 PM IST

మహిళల ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ రెండింటిలోనూ మంధన టాప్‌-3లోకి దూసుకొచ్చింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఆమె… టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానంలో నిలిచింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ సిరీస్‌ల్లో నిలకడగా రాణించడంతో ఆమె ర్యాంకింగ్ మెరుగైంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్‌ సెంచరీ చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించింది. ఇక భారత​ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా జెమీమా రోడ్రిగెజ్‌ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది.