స్మృతి సరికొత్త చరిత్ర మిథాలీ రికార్డ్ బ్రేక్

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన స్మృతి అరుదైన రికార్డు అందుకుంది.వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా నిలిచింది.

  • Written By:
  • Publish Date - October 30, 2024 / 02:45 PM IST

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన స్మృతి అరుదైన రికార్డు అందుకుంది.వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్‌ రికార్డును స్మృతి బ్రేక్‌ చేసింది. కాగా గతంలో మిథాలీ రాజ్‌ 211 వన్డే ఇన్నింగ్స్‌ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది. కివీస్ పై తొలి రెండు వన్డేల్లోనిరాశపరిచిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్.. మూడో మ్యాచ్ లో మాత్రం అదరగొట్టింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది