పాము అంటే చాలా మందికి భయం. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు భయంతో వణికిపోతారు. కొందరైతే వెంటాడి మరీ దాన్ని చంపేస్తారు. ఎందుకంటే పాము విషపూరితం కాబట్టి. కొన్ని పాములు కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి కాబట్టి. కానీ అంత డేంజరస్ పాములతో ఓ వైన్ తయారు చేస్తారని. ఆ వైన్‌ను ప్రజలు తాగుతారు అని మీకు తెలుసా ? ఎస్.. స్వయంగా పామును వైన్‌లో పులియబెట్టి తయారు చేసే స్నేక్ వైన్ చైనాలో చాలా ఫేమస్. కేవలం చైనా మాత్రమే కాదు.. జపాన్, కంబోడియా, కొరియా, లావోస్, తైవాన్, వియత్నాం, థాయిలాండ్ లాంటి చాలా కంట్రీస్‌లో ఈ వైన్‌ను రోడ్‌సైడ్‌లో కూడా అమ్మేస్తుంటారు.
నిజానికి ఈ వైన్ ఇప్పుడు వాడుకలోకి వచ్చింది కాదు. 200 BC నుంచి ఈ వైన్ అందుబాటులో ఉంది. చాలా దేశాల్లో ఇప్పటికీ దీన్ని ఓ ట్రెడిషనల్ డ్రింక్‌గా కన్సిడర్ చేస్తున్నారు. నార్మల్‌గా బియ్యం, గొధుమలు లాంటి ఇంగ్రీడియన్స్ ఉపయోగించి వైన్ తయారు చేస్తారు. అలా చేసిన వైన్‌లో పామును ప్రాణాలతో లేదంటే చనిపోయిన తరువాత నానబెడతారు. అలా దాదాపు నెల రోజుల పాటు ఉంచి తరువాత బాటిల్స్‌లో నింపి అమ్మేస్తుంటారు. ఈ వైన్ తాగడం వల్ల మగవాళ్లకు సెక్సువల్ పవర్ పెరుగుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఈ వైన్ తాగడం సేఫేనా అంటే.. చాలా దేశాల్లో శాస్త్రవేత్తలు సేఫ్ అనే చెప్తున్నారు. పాములను వాడి చేస్తున్నారు కాబట్టి ఈ వైన్ తయారీలో ప్రతీ స్టెప్ చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. ఫస్ట్ బియ్యం లేదంటే గోధుమలతో వైన్ తయారు చేస్తారు. తరువాత అదే వైన్‌లో బతికి ఉన్న పామును వేస్తారు. ఆ పాము బాటిల్‌లోనే వైన్ తాగి వామిత్ చేసుకుంటుంది.
ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత పాము కడుపు క్లీన్ అవుతుంది. అప్పుడు ఆ మాపును తీసి నీట్‌గా కడిగి మరో బాటిల్‌లో వైన్ నింపి పామును అందులో వేస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత పాము చనిపోతుంది. ఆ తరువాత వైన్‌లో ఉన్న పాము విషాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రోటీన్లు, ఇథనాల్, ఫార్మాల్డిహైడ్ లాంటివి కలుపుతారు. ఇది కలపడం ద్వారా వైన్‌లో విషం పూర్తిగా చచ్చిపోయి నార్మల్ డ్రింక్‌గా మారుతుంది. ఇందులో తయారయ్యే “అనాల్జేసిక్” నొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. నార్మల్ వైట్ వైన్‌తో కంపేర్ చేస్తే ఈ వైన్ చాలా డార్క్‌గా కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వ్యాధులను నయం చేసేందుకు ఈ వైన్‌ను ఉపయోగించేవాళ్లు. కుష్టువ్యాధి, విపరీతమైన చెమట, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి అనేక వ్యాధులకు ఈ వైన్‌తో చికిత్స చేశారు.
చైనీస్ భాషలో పిన్యిన్, వియత్నమీస్‌లో ఖ్మెర్‌గా పిలిచే ఈ వైన్‌ను ట్రెడిషనల్ టానిక్‌గా తీసుకుంటున్నారు. అందుకే ఈ దేశాల్లో ఇది రోడ్‌సైడ్ షాపుల్లో కూడా దొరుకుతోంది. కేవలం పాములు మాత్రమే కాదు. ఎలకలు, తాబేళ్లు, తొండలతో కూడా ఈ వైన్ తయారు చేస్తున్నారు. విదేశాల్లో నాన్‌వెజిటేరియన్‌గా వైన్‌గా దీన్ని సేల్ చేస్తున్నారు. కేవలం వైన్ మాత్రమే కాదు. పాము రక్తాన్ని కూడా చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో ఉపయోగిస్తున్నారు. చర్మం డ్రై అవ్వకుండా ఉండేందుకు. మంచి గ్లో రావడానికి పాము రక్తంతో చేసిన చాలా ప్రోడక్ట్స్‌ను ఎప్పనుంచో వినియోగిస్తున్నారు.