SUMMER IN TELUGU STATES: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఐదు రోజులపాటు ఎండలే ఎండలు..

ఇటీవలి కాలంలో తెలంగాణ, ఏపీల్లో ఎండలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతుండగా, ఏపీలో ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 06:08 PM IST

SUMMER IN TELUGU STATES: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సూర్యుడి ప్రభావం మొదలైంది. మార్చి మొదటివారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతోనే సతమతమవుతుంటే.. మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 7 వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Anant Ambani: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌లో మెరిసిన తారలు.. లేటెస్ట్ ఫొటోస్

ఎండల తీవ్రత నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇటీవలి కాలంలో తెలంగాణ, ఏపీల్లో ఎండలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతుండగా, ఏపీలో ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. నిజామాబాద్​ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్​ నగర్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్​‌లో పగటి ఉష్ణోగ్రతలు సగటున రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. తెలంగాణలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏపీలోని విజయవాడతో పాటు అనంతపురం వంటి రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకుంటుండటంతో.. ఏప్రిల, మేలలో ఎండలు ఇంకెలా ఉంటాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.