Rave Party FIR : చెట్ల మధ్య కొందరు.. గదుల్లో ఇంకొందరు.. రేవ్‌ పార్టీ FIRలో సంచలన విషయాలు..

బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ కంటిన్యూ అవుతోంది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారికి డ్రగ్ టెస్ట్ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్.

హేమ గురించి ఏం చేర్చారంటే…

 

బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ కంటిన్యూ అవుతోంది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారికి డ్రగ్ టెస్ట్ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. డ్రగ్స్ కేసులో మొత్తం ముగ్గురు తెలుగు సినిమా నటులు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. నటి హేమతో పాటు.. మేకా శ్రీకాంత, ఆషీరాయ్‌కు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. వీళ్లందరికీ నోటీసులు పంపించిన సీసీబీ అధికారులు.. హెబ్బగుడి పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ ఎందుకు తీసుకున్నారు.. ఎవరు తెచ్చిచ్చారు.. ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. మరికొందరిని బాధితులుగా చేర్చి.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఐతే రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ జరిగింది.

ఈ కేసులో A1గా వాసును చేర్చిన బెంగళూరు పోలీసులు.. A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డి పేరు చేర్చారు. A7గా 68మంది యువకులు, A8గా 30మంది యువతులను ఎఫ్ఐఆర్‌లో దాఖలు చేశారు. A1గా ఉన్న వాసు… తన ఫ్యామిలీ ఫ్రెండ్ కేసులో A6గా ఉన్న గోపాల్ రెడ్డిని సంప్రదించి.. పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు. గోపాల్ రెడ్డి.. తన GR ఫాంహౌస్‌లో పార్టీ చేసుకోమని చెప్పడంతో.. A2గా ఉన్న అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లు చూసుకున్నాడు. నాగబాబు, రణధీర్ బాబు.. పార్టీ కోసం డ్రగ్స్ అరేంజ్ చేశారు. పార్టీకి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. అందరినీ డ్రగ్స్ తీసుకోమని వాసు చెప్పాడు.

ఐతే ఎలక్ట్రానిక్ సిటీ పీఎస్‌లో రేవ్ పార్టీపై కంప్లైంట్ రాగా.. 19వ తేదీ రాత్రి పదకొండున్నరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ, సేవిస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్‌ తీసుకున్న పోలీసులు.. ఆరోజు రాత్రి 11 గంటలకు రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశారు. ఆ సమయంలో కొంతమంది డ్యాన్స్‌లు చేస్తుండగా.. మరికొందరు ఫామ్‌హౌస్‌ చెట్ల మధ్యలో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్నారు. వారి దగ్గరి MDMA పిల్స్‌, కొకైన్, హైడోగాంజా డ్రగ్స్‌ లభించాయ్. కొందరు నేరుగా.. మరికొందరు 5వందల రూపాయల నోటుతో కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఎఫ్ఐఆర్‌లో పోలీసులు బయటపెట్టిన సంచలన విషయాలు.. కేసు మీద మరింత సస్పెన్స్‌ క్రియేట్ చేస్తున్నాయ్.