Somesh Kumar: సోమేష్‌ కుమార్‌ నియామకంపై విపక్షాల ఫైర్‌ ఆయన మీద కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ ?

ఆయనది ఈ రాష్ట్రం కాదు.. ఈ కేడర్‌ కాదు.. ఐనా సార్ అసలే వదట్లేదు ఎందుకో మరి ! సోమేష్‌ కుమార్‌ ఎపిసోడ్‌లో కేసీఆర్ తీరు చూసి ఇప్పుడు అందరు అనుకుంటున్న మాటలివే ! తెలంగాణకు సీఎస్‌గా పనిచేసి.. ఆ తర్వాత ఏపీకి వెళ్లి.. అక్కడ ఇమడలేక వీఆర్ఎస్‌ తీసుకొని మళ్లీ హైదరాబాద్‌ వచ్చేశారు సోమేష్‌. ఇలా వచ్చారో లేదో.. ఆయనకో పదవి కట్టబెట్టారు కేసీఆర్‌. తెలంగాణ సీఎంకు ప్రధాన సలహాదారునిగా తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 04:02 PM IST

సలహాదారు పదవి కోసం ఐఏఎస్‌గా రిటైర్ అవ్వడం ఏంటన్నదే ఇప్పుడో మిలియన్‌ డాలర్ ప్రశ్నగా మారింది. సోమేష్‌ కుమార్ నియామకంపై విపక్షాలు భగ్గుమంటున్నాయ్. కుంభకోణాల కోసమే సోమేశ్ కుమార్‌ను మళ్లీ తీసుకువచ్చారని.. కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. సోమేశ్ కనుసన్నుల్లోనే హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల రూపాయల భూములు చేతులు మారాయని.. భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. ఐనా బాధ్యతలు అప్పజెప్పిన చోట పనిచేయకుండా.. వీఆర్ఎస్‌ తీసుకొని మరీ ఇక్కడ చేరాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

రిటైర్‌ అయినవాళ్లు పదవుల కోసం పాకులాడడం ఏంటూ మండిపడ్డారు. ఇక షర్మిల అయితే మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సలహాలు వినని వాళ్లకు సలహాదారు ఏంటో అంటూ.. కేసీఆర్, సోమేష్‌ను కలిపి సెటైర్లు గుప్పించారు. ఎన్నికల ఏడాదిలోకి అడిగిపెట్టిన వేళ.. ప్రతీ అంశం రాజకీయమే అవుతోంది. ఇప్పుడు సోమేష్‌ విషయంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సోమేష్‌ మీద కేసీఆర్‌ చూపిస్తున్న ప్రత్యేకమైన ప్రేమను ఇప్పుడు విపక్షాలు ఆయుధంగా చేసుకుంటున్నాయ్. రాజకీయ మంటలు రేపుతున్నాయ్.

ఇదంతా ఎలా ఉన్నా.. సోమేష్‌ మీద కేసీఆర్‌కు ఇంత ప్రేమ ఏంటి అన్నదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. పట్టుపట్టి మరీ ఆయనను సీఎస్‌గా చేశారు.. ఎన్ని విమర్శలు ఎదురైనా కొనసాగించారు. ఒకరకంగా కేసీఆర్‌కు షాడో కనిపించారు ఓ స్టేజీలో సోమేష్ అనే ఆరోపణలు వినిపించాయ్. ఐతే కేసీఆర్‌కు సోమేష్‌ ఎలాంటి సలహాలు ఇస్తారు.. ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. సోమేష్‌కుమార్‌ది తెలంగాణ కాదు. ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన ప్రేమ ఏమీ ఉండదు. ఐతే ఒక్కటి మాత్రం నిజం. కేసీఆర్‌ ఏది చెప్తే అది.. గీత దాటకుండా సోమేష్‌ కుమార్‌ పని ముగించేస్తారనే ఓ పేరు ఉంది. అందుకే.. సోమేష్‌ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఓ టాక్ ఉంది రాజకీయాల్లో ! ఇదంతా ఎలా ఉన్నా.. పేరుకు సలహాదారు అయినా.. సోమేష్‌కు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తంది. పాలనా వ్యవహారాల్లోనూ కీ రోల్ పోషించబోవడం ఖాయం అని సెక్రటేరియట్ వర్గాలు చెప్పుకుంటున్నాయ్.