కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా హర్యానా నుంచి ఢిల్లీ వచ్చిన రైతులతో మాట మంతి నిర్వహించారు. దేశంలో నిత్యవసరాల ధరలు పెరడం, అగ్నివీర్ పథకాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళా రైతులు రాహూల్ పెళ్లి ప్రస్తావన తీసుకొని వచ్చారు. దీనికి ధీటుగా సోనియా రాహూల్ కి తగిన సంబంధం ఉంటే చూడండి అని బదులిచ్చారు. దీంతో యువరాజు పెళ్లి గురించి సోనియా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాహూల్ మనసులో ఏముందో ఇప్పట వరకూ ఏమీ తెలియలేదు. ప్రేమ, పెళ్లి వదిలేసి దేశం, సమాజం, రాజకీయం అంటూ అడుగులు వేస్తున్నారు. బహుషా రాజ్యధికారాన్ని సాధించి రాణిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారో ఏమో. వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఇంతటి సంభాషణలో ఇతను పెళ్లి చేసుకోను అని ఎక్కడా చెప్పలేదు. తల్లి ప్రస్తావనను తోసి పుచ్చనూ లేదు. దీంతో రాహూల్ పెళ్లిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక ఈ సందర్బంగా రాహూల్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఈ రోజు మాకు అత్యంత మధురమైన జ్ఞాపకాలను అందించిన సుదినం. సోనా పేట్ కు చెందిన రైతు సోదరీమణులు ఢిల్లీని సందర్శించేందుకు వచ్చారు. ఇలా పర్యటనలో భాగంగా తమను కలిసేందుకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఇలా వచ్చిన వాళ్లు ఒట్టి చేతులతో రాలేదు. ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి, తియ్యటి లస్సీ, తమ చేతులతో తయారుచేసిన పచ్చళ్లు బహుమానంగా తీసుకొని వచ్చారు. వీటన్నింటితో పాటూ వెలకట్టలేనంత ప్రేమను తమకు పంచారు. వీరితో కలిసి భోజనం చేయడం, వారి సమస్యలను వింటూ ఒక రోజు గడపడం కొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు, అమ్మకు, ప్రియాంక గాంధీకి ఇది జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ రాసుకొచ్చారు.
ఈ మహిళా రైతులతో తమ వ్యక్తి గత విషయాలు మొదలు రాజీవ్ గాంధీ మరణం, భారత్ జోడో యాత్ర విశేషాలు, దేశ పరిస్థితులు, నిత్యవసర ధరల పెంపు ఇలా అన్నింటినీ ప్రస్తావిస్తూ ఒక రోజంతా సోనియా, ప్రియాంక, రాహూల్ గాంధీలతో గడిపేశారు. ఇలా గడపడం పట్ల రైతు కుటుంబీకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
T.V.SRIKAR