Sonia Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. గురువారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రజలనుద్దేశించి, మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. “ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కాని మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి.
Chandrababu Naidu: ఆ రెండు షరతుల్లో బాబుకు రిలీఫ్! స్కిల్ కేసులో సుప్రీం ఆదేశాలు
మీ కలలు సాకారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మా అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయండి. మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి” అని సోనియా గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ పాల్గొనలేకపోయారు. కాంగ్రెస్ తరఫున జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా తనయుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు. కానీ, ఒక్క ప్రచారానికి కూడా సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగిసింది.