నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. 3రోజుల ముందుగానే అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోస్తాలో.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7మిమీ, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7మిమీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33మిమీ, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2మిమీ వర్షా పాతం నమోదైంది. అనంతపూరం జిల్లాలో భారీ వర్షాలతకు వేదవతి హగరి వాగు పొంగి.. మొక్కజొన్న, పత్తి పంటలు అన్ని పూర్తిగా జలమయం అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాడి పశువులు, గేదెలు, మతృచెందాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. కాగా రెమాల్ తుఫాను కారణంగా కేరళను తాకిన తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి వేగంగా ప్రవేశించాయని, గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు.
మరో వైపు బెంగళూరులో ఇప్పటికే వర్షాలు మొదలైయ్యాయి.. గత రెండు రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(ఆదివారం) సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురుగాలులకు చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పర్పుల్ లైన్లోని ట్రినిటీ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో ట్రాక్పై చెట్టు కూలిపోయింది. దీంతో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.