నేడు తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. జూన్ 4వ తేదీలోపు ధరణి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలను కమిటీ సభ్యులు అధికారులకు వివరించనున్నారు. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల అప్లికేషన్లపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలపై సైతం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ధరణి డ్రైవ్లో పరిష్కరించిన అప్లికేషన్లను కమిటీ సమీక్షించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.