SRH vs MI: హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో రికార్డుల మోత మోగింది. ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 277 పరుగులు సాధించింది. ఇంతకుముందున్న ఆర్సీబీ 263 అత్యధిక పరుగుల రికార్డును హైదరాబాద్ బ్రేక్ చేసింది. అంతేకాదు.. ఇదే మ్యాచులో ఐపీఎల్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు ఎస్సారెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ.
Kavitha Tihar Jail: కవిత జైల్లో మొదటి రోజు.. ఎలా గడిచిందంటే..!
16 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇంకో రికార్డు నమోదైంది. రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఇదే మ్యాచులో నమోదవ్వడం విశేషం. హైదరాబాద్ మరో బ్యాటర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. నిజానికి మొదట ట్రావిస్ హెడ్ అర్థ సెంచరీ సాధించాడు. దీంతో గతంలో ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును ట్రావిస్ బ్రేక్ చేశాడు. అయితే, కొద్ది నిమిషాల్లోనే ఈ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ఇలా ఒకే మ్యాచులో ఒకరి తర్వాత ఒకరు వరుసగా రికార్డులు బ్రేక్ చేయడం ఇదే తొలిసారి. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యారు.
మరో బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచులోనూ చెలరేగాడు. 34 బంతుల్లోనే 80 పరుగులో నాటౌట్‌గా నిలిచాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా 28 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో పాండ్యా, కొయిట్జి, చావ్లా తలో వికెట్ తీశారు.