ఉప్పల్ క్రికెట్ స్టేడియం (Uppal Cricket Stadium )లో ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ కు దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి (CP Tarun Joshi) పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30గంటల వరకు చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ (HMDA) భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ (Nagol) వైపు వెళ్లాలని సూచించారు.
నేడు మెట్రో పొడిగింపు..
ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25న పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు. ఉప్పల్ మార్గంలో చివరి మెట్రో రైలుఅర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు.
ఉప్పల్, ఎన్టీఆర్ స్టేషన్లకు మాత్రమే మెట్రో సర్వీసులు..
మ్యాచ్ అనంతరం అర్థ రాత్రి సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, మిగతా మార్గాలలో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలల్లో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు (Metro services) కొనసాగుతాయన్నారు. అంటే, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని చెప్పారు.
SSM