Sri Lanka Visa Free: వీసా ఫ్రీ దేశంగా శ్రీలంక.. ఏఏ దేశాలకు వర్తిస్తుందో తెలుసా..?

పర్యటకానికి కొలంబో పెట్టింది పేరు. శ్రీలంక ఆదాయంలో ఆధిక శాతం రాజధాని టూరిజం నుంచే వస్తుంది. గతంలో ఇక్కడికి ఇండియా సహా ఇతర దేశాల నుంచి వెళ్లాంటే టూరిస్ట్ వీసా తప్పని సరి. అయితే తాజాగా శ్రీలంక ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. భారత్ సహా మిగిలిన ఏడు దేశాలకు టూరిజిం వీసా లేకుండానే పర్యటించే సదావకాశం కల్పించింది.

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 03:29 PM IST

కోవిడ్ సమయంలో కొలంబో వాసులు తీవ్రమైన గడ్డుకాలాన్ని అనుభవించారు. దీనికి తోడూ మన్నటి వరకూ ఎదురైన ఆర్థిక సంక్షోభానికి టూరిజం కూడా కారణమే. కేవలం టూరిజం నుంచే శ్రీలంకకు సగం పైగా ఆదాయం చేకూరుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకూ ఐ లాండ్స్ ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్స్, సీ వ్యూ హోటల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకే ఇక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. పైగా తక్కువ ఖర్చులోనే ప్లాన్ చేయవచ్చు. బయట కొన్ని ట్రావెల్స్ తక్కువ ప్యాకేజీకి టూర్ ను ఏర్పాటు చేస్తూ ఉంటాయి.

తాజాగా పర్యటక ప్రదేశాలకు వీసా లేకుండా అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్ లాండ్, తోపాటూ మన దేశానికి కూడా స్థానం కల్పించారు. ప్రస్తుతం ఈ దేశాలను పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు శ్రీలంక క్యాబినెట్లో మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమలవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు.

టూరిజాన్ని పెంపొందించడం వల్ల వివిధ దేశాల కరెన్సీలు శ్రీలంక ఖజానాలో వచ్చి చేరుతాయి. తద్వారా విదేశీ మారకం విలువ పెరిగినప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొన ఊపిరి మీద కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పర్యాటకానికి జీవం పోసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. 2023 సంవత్సరానికి గానూ 20 లక్షల మందిని ఆకర్షించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ వీసా ఫ్రీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఐదు దేశాలనే అనుమతివ్వాలని అనుకున్నప్పటికీ తాజాగా దీని సంఖ్య ఏడు కు పెంచారు.

T.V.SRIKAR