SSMB29: జ‌క్క‌న్న‌-మ‌హేశ్ క‌థ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది.

ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా స‌క్సెస్ త‌రువాత టాలీవుడ్‌లోనే కాదు వ‌రల్డ్ వైడ్‌గా రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రంతో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇక‌.. జ‌క్క‌న్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూప‌ర్ స్టార్ (Super star) మ‌హేశ్ బాబు (Mahesh Babu) తో ఉండ‌డంతో ఆ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. ఈ మూవీలో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. మహేష్ బాబుకి జోడీగా ఇండోనేసియా బ్యూటీని (Indonesia) ఫైనల్ చేశారని టాక్ న‌డుస్తోంది.

SSMB29: ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా స‌క్సెస్ త‌రువాత టాలీవుడ్‌లోనే కాదు వ‌రల్డ్ వైడ్‌గా రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రంతో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇక‌.. జ‌క్క‌న్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూప‌ర్ స్టార్ (Super star) మ‌హేశ్ బాబు (Mahesh Babu) తో ఉండ‌డంతో ఆ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. ఈ మూవీలో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. మహేష్ బాబుకి జోడీగా ఇండోనేసియా బ్యూటీని (Indonesia) ఫైనల్ చేశారని టాక్ న‌డుస్తోంది. మ‌హేశ్ – రాజ‌మౌళి కాంబోలో వ‌స్తున్న ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ భారీ బ‌డ్జెట్‌తో యూనివ‌ర్సల్ కాన్పెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ (World Adventure Travel) గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. దీంతో.. ఈ మూవీ స్టోరీ ఏ రేంజ్‌లో ఉండ‌నున్నాయా అన్న అంచ‌నాలు పెరిగిపోయాయి. దీంతో.. ఈ మూవీ స్టోరీపై రాజ‌మౌళి ఫుల్ కాన్‌సెన్‌ట్రేట్ చేశార‌ట‌.. విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఇప్పటికే కథ సిద్ధం చేసి రాజమౌళికి ఇచ్చారంట.. అయితే జ‌క్క‌న్న స్క్రీన్‌ప్లే విష‌యంలో సాటిస్పేక్ష‌న్‌గా లేర‌ని.. అందుకే క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ సూచించార‌ని ఓ టాక్ న‌డుస్తోంది.

రాజ‌మౌళి (SS Rajamouli) సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఉంటాయి.. దానికి త‌గ్గ‌ట్లుగానే జ‌క్క‌న్న ప్ర‌తి సీన్‌ను కూడా ఓ శిల్పి చెక్కిన‌ట్లు ఎంతో శ్ర‌ద్ధ‌గా తీస్తారు. ఏ చిన్న విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కారు.. అలాంటిది క‌థ విష‌యంలో అయితే అస్స‌లు కాంప్ర‌మైజ్ అయ్యే స‌మ‌స్యే ఉండ‌దు. ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే బాధ్యతని తండ్రి విజయేంద్రప్రసాద్ ని జక్కన్న అప్పగించారు. అందుకే రాజ‌మౌళి సూచ‌న‌ల మేర‌కు విజయేంద్రప్రసాద్ టీమ్ స్క్రిప్ట్ పై మరోసారి వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ వైపు జక్కన్న స్క్రిప్ట్ లో మార్పులు చేయిస్తూనే మరో వైపు క్యాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది..

ఇక‌.. మహేష్ బాబు విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం ఆయ‌న గుంటూరు కారం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారంలో మషేష్ బాబు లుక్స్‌కి, స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.. రెండు డ్యాన్స్ బీట్స్‌తో ఫ్యాన్స్‌కు మంచి మ‌సాలా అందించారు. ఇక‌.. రాజ‌మౌళితో వ‌ర్క్ స్టార్ట్ చేసిన త‌ర్వాత ఫుల్ టైం జ‌క్క‌న్నతోనే ఎంగేజ్ కావాలి కాబ‌ట్టి.. దానిక‌న్నా ముందే కొద్ది రోజులు ఫ్యామిలీతో స్పెండ్ చేయాల‌ని మ‌హేశ్ ఫిక్స‌యిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాతే రాజమౌళి సినిమా ప్రీప్రొడక్షన్ యాక్టివిటీస్ పై మహేష్ బాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మ‌రి.. రాజ‌మౌళి టేకింగ్‌, మ‌హేశ్ స్టైలింగ్‌తో రానున్న ఈ సినిమా వ‌రల్డ్ వైడ్‌గా ఎలాంటి రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌నుందో చూడాల్సిందే.