క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ టీ టెన్ లీగ్ మళ్ళీ వచ్చేస్తోంది. గత ఏడు సీజన్లుగా ఫ్యాన్స్ ను అలరిస్తున్న అబుదాబి టీ10 లీగ్ ఎనిమిదో సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకూ అబుదాబి వేదికగా టోర్నీ జరగనుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి మరింత ఎంటర్ టైన్ మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ క్రికెట్ లో టాప్ స్టార్ ప్లేయర్స్ అందరూ టీ 10 లీగ్ లో ఆడబోతున్నారు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు టాప్ క్రికెటర్లను రిటైన్ చేసుకున్నాయి. రిటైన్ చేసుకున్న వారిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ , సౌతాఫ్రికాకు చెందిన స్టార్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. రషీద్ ఖాన్, షకీబుల్ హసన్, పొల్లార్డ్ , సునీల్ నరైన్, నికోలస్ పూరన్ , జాస్ బట్లర్ , లివింగ్ స్టోన్ , స్టోయినిస్, నోర్జే వంటి టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్ అంతా ఈ సారి బరిలోకి దిగబోతున్నారు.
గత కొంత కాలంగా టీ10 ఫార్మాట్ కు క్రేజ్ బాగా పెరిగింది. అబుదాబి టీ10 లీగ్ తొలి సీజన్ సక్సెస్ తోనే నిర్వాహకులకు ఐసీసీ అనుమతివ్వడంతో పలు దేశాలకు ఈ ఫాస్టెస్ట్ ఫార్మాట్ ను విస్తరించారు. జింబాబ్వే, యుఎస్ఏతో పాటు శ్రీలంకలోనూ లీగ్స్ మొదలయ్యాయి. భారత క్రికెటర్లు తప్పిస్తే మిగిలిన అన్ని దేశాల ఆటగాళ్ళు టీ 10 లీగ్స్ లో అలరిస్తున్నారు. క్రేజ్ పెరగడంతో పాటు ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చిన తర్వాత ఐవొసీ ఈ ఫార్మాట్ కే మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. అందుకే గంటన్నరలో తేలిపోయే ఈ ఫార్మాట్ లో
అటు ఆటగాళ్ళుకు, ఇటు అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతోంది. ఈ కారణంగానే బీసీసీఐ కూడా టీ10 ఫార్మాట్ లో లీగ్ నిర్వహించాలనుుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బిజీ షెడ్యూల్ తో ఐసీసీ విండోలో ఖాళీ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద ఆరంభ సీజన్ నుంచి క్రమంగా క్రేజ్ పెంచుకుంటున్న అబుదాబీ టీ టెన్ లీగ్ లో ఈ సారి స్టార్ ప్లేయర్స్ సందడి మరింత ఎక్కువగా కనిపించబోతోంది.