కింగ్ నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే ‘నా సామిరంగా’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్ మూవీ ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ మూవీ భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసిన నాగార్జున ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మూవీ అదరహో అంటున్నారు. ఈ మూవీ టైటిల్ కార్డ్స్ నా సామిరంగ సూపర్ అంటున్నారు. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ. కిష్టయ్య అంజి అనాథలు. అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసి మెలిసి ఉంటారు. చిన్నప్పుడు తమకు సాయం చేసినందుకు అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్యకు అమితమైన గౌరవం ఇస్తారు. కిష్టయ్య అంటే పెద్దయ్య కూడా అంతే ప్రేమ చూపిస్తారు. కిష్టయ్య, వరాలు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పడానికి వస్తారు. వరాలు తండ్రి వరదరాజులు పెద్దయ్య కుమారుడు దాసు కి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. కిష్టయ్య, వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొడుక్కి అనుకున్న సంబంధాన్ని వదిలేస్తాడు పెద్దయ్య. కిష్టయ్యకు వరాలును ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడా? తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కిష్టయ్య కోసం తనను వదిలేయడాన్ని ఎంత మాత్రం సహించలేని దాసు ఏం చేశాడు? పొరుగూరు జగన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి తో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ ప్రేమ కారణంగా రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? కిష్టయ్య, అంజిలను చంపాలనుకున్న దాసు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా? అనేది సినిమా
విశ్లేషణ..
డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ నాగ్‌కు మంచి మెమెరబుల్ హిట్‌ను ఇచ్చాడనే చెప్పాలి. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ఈ మూవీలో నాగ్ తన మాసివ్ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కింగ్ ఐకానిక్ టెంప్లెట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే నా సామి రంగా అనిపించాడు.. తెరపై నాగ్- ఆశికా సీన్స్ అద్భుతంగా పండాయి. ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇంట్రో ఫైట్ సీక్వెన్స్, లవ్ ట్రాక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ప్యూర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఆర్‌ఆర్ అదిరిపోయింది. సాంగ్స్ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఖాయం సంక్రాంతి బరిలో నా సామిరంగ ప్యామిలీ మూవీగా మంచి మార్కులు కొట్టేయడం ఖాయం.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాను మరిపించే కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే నాగార్జునకు సంక్రాంతి మరోసారి అదిరిపోయే హిట్‌ను అందించినట్లే కనిపిస్తోంది.