ఇప్పటికీ అదే వీక్ నెస్, కోహ్లీపై మంజ్రేకర్ ఫైర్

పింక్ బాల్ టెస్టులో అదరగొట్టాలనుకున్న విరాట్ కోహ్లీకి తొలి ఇన్నింగ్స్ నిరాశే మిగిలింది. పెర్త్ టెస్టులో సూపర్ సెంచరీతో ఫామ్ అందుకున్న కోహ్లీ రెండో టెస్టులో నిరాశపరిచాడు. తన బలహీనతను అధిగమించలేక ఎప్పటిలానే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కోహ్లీపై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 07:42 PM IST

పింక్ బాల్ టెస్టులో అదరగొట్టాలనుకున్న విరాట్ కోహ్లీకి తొలి ఇన్నింగ్స్ నిరాశే మిగిలింది. పెర్త్ టెస్టులో సూపర్ సెంచరీతో ఫామ్ అందుకున్న కోహ్లీ రెండో టెస్టులో నిరాశపరిచాడు. తన బలహీనతను అధిగమించలేక ఎప్పటిలానే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కోహ్లీపై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. కెరీర్ ఆరంభంలో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతుల్ని వెంటాడటం కోహ్లీ బలహీనతగా ఉండేది. అయితే.. గత రెండు మూడేళ్లుగా ఆ బలహీనతని అధిగమించిన కోహ్లీ మైదానంలో పరుగులు వరద పారించాడు. గత కొంతకాలంగా మళ్ళీ అదే వీక్ నెస్ తో వికెట్లు సమర్పించుకుంటున్నాడు. ఇప్పుడు పింక్ బాల్ టెస్టులో కోహ్లీ బలహీనత మరోసారి వెంటాడటంతో.. భారత్ జట్టులో కంగారు మొదలైంది.

తొలి టెస్ట్‌లో సెంచ‌రీతో ఫామ్‌లోకి వ‌చ్చిన స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి వ‌చ్చి రావ‌డంతోనే ఫోర్ కొట్టి ఊపుమీద క‌నిపించాడు. ఎనిమిది బాల్స్‌లో ఏడు ప‌రుగులు చేసిన కోహ్లి చెత్త షాట్ కు ఔటై నిరాశ‌ప‌రిచాడు. స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. బంతిని వదిలేయాలని ఆలస్యంగా భావించి స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఇదే తరహాలో ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను వదిలేయాలని ఆఖర్లో భావించి స్లిప్‌లో దొరికిపోయాడు. తన అలసత్వంతో కోహ్లి వరుస టెస్టుల్లో వికెట్లు చేజార్చుకున్నాడు. దీంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. ఇప్పటికే అదే వీక్ నెస్ తో కోహ్లీ ఔటవడం నిరాశకు గురిచేస్తోందని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ విఫలమవ్వడానికి గల కారణాలను విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ సగటు 48కి దిగజారడానికి ప్రధాన కారణం అతడి బలహీనతేనన్నాడు. సమస్యను పరిష్కరించడానికి బదులు మొండిగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోందని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్ళే బంతులను ఆడే వీక్ నెస్ నుంచి కోహ్లీ బయటపడకుంటే కష్టమని మంజ్రేకర్ తేల్చేశాడు. అంతకుముందు రెండేళ్ళు ఈ వీక్ నెస్ కనిపించలేదని గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్లు కోహ్లీ 2024 ఫామ్ గురించి కొన్ని పోస్టులు చేశారు. ఈ ఏడాది విరాట్ గణాంకాలు గొప్పగా ఏం లేవని, ఒకే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు.