కొత్త ఏడాదిలో భారత్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కావడంతో ఇంగ్లాండ్ సెలక్టర్లు దాదాపు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేశారు. ఊహించినట్టుగానే కెప్టెన్‌గా జోస్ బట్లర్ బాధ్యతలు తీసుకోగా… టెస్టుల్లో సూపర్ ఫామ్ లో ఉన్న జో రూట్ మళ్ళీ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నవంబర్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తరువాత అతడు మళ్లీ వన్డేలు ఆడలేదు. ఇటీవల కివీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం కావడంతో అతడిని ఎంపిక చేయలేదు. దీంతో పాటు భారత పర్యటనకు ఇంగ్లండ్ తన టి20 జట్టును కూడా ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలో బెస్ స్టోక్స్‌కు చోటు దక్కలేదు. స్టోక్స్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత పర్యటనకు కూడా అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో క్రికెట్ కారిడార్లో ఇదే హాట్ టాపిక్.
అయితే ప్రస్తుతం అతను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి స్టోక్స్ ఫీల్డ్‌కి దూరంగా ఉన్నాడు. అతను కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని సమాచారం. ఈ కారణంగానే భారత పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. ఒకవిధంగా ఇంగ్లాండ్ కు ఇది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.స్టోక్స్ చాలా సందర్భాలలో ఆల్ రౌండర్ పాత్ర పోషించాడు.
బెన్ స్టోక్స్ చాలా కాలంగా ఇంగ్లండ్ తరఫున ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు. నవంబర్ 2023లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే స్టార్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ లు తమ స్థానాలు నిలుపుకున్నారు.
ఇదిలా ఉంటే భారత్ లో ఇంగ్లాండ్ జట్టు పర్యటన జనవరి 22 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ లో ఇంగ్లీష్ టీమ్ ఐదు టీ ట్వంటీలు , మూడు వన్డేలు ఆడనుంది. మొదట టీ ట్వంటీ సిరీస్ జరగనుండగా… తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది. ఫిబ్రవరి 2 వరకూ టీ ట్వంటీ సిరీస్ , ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ తో ఫిబ్రవరి 6న వన్డే సిరీస్ మొదలవుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లకు ఇదే మేజర్ సిరీస్ కావడంతో పూర్తిస్థాయి జట్లతోనే ఆడబోతున్నాయి.