Sudha Murty: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి కోటాలో ద్రౌపది ముర్ము.. సుధామూర్తిని శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. నారాయణ మూర్తి భార్యగానే కాకుండా సుధా మూర్తి వివిధ రంగాల్లో స్వశక్తితో నిలబడేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. సామాజిక సేవ, రచన, విద్యారంగాల్లోనూ సత్తాచాటి.. తనదైన ముద్ర వేశారు.
Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్
ఆమె రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా దినోత్సవం రోజునే సుధామూర్తిని రాష్ట్రపతి, రాజ్యసభకు నామినేట్ చేయడం విశేషం. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. తన భర్తకు రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ దేశంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇంత పెద్ద సంస్థకు తన భర్త భాగస్వామిగా ఉన్నప్పటికీ సుధామూర్తి చాలా సాదాసీదాగా, ఒదిగి ఉంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. సమాజ సేవలో భాగం అవుతూనే.. వివిధ సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. ఆమె చేస్తున్న సేవలకుగాను.. ఇప్పటికే పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.
సుధామూర్తి రాజ్యసభకు నామినెట్ అయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు అభినందనలు తెలియజేశారు. సుధామూర్తిని పెద్దల సభకు పంపించడం సంతోషంగా ఉందని, రాజ్యసభలో తన పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగం, కళలు, సాహిత్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ 12 మందిలో సుధామూర్తి ఒకరు.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji’s contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024