SUMMER HEAT: రేపటి నుంచి నిప్పుల కుంపటే.. హైదరాబాదీస్‌.. బీ అలర్ట్‌..

సూర్యుడు ముందుగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు క్రియేట్‌ అవుతున్నాయ్. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 04:06 PM IST

SUMMER HEAT: ఎండలు దంచికొడుతున్నాయ్. భానుడి భగభగలకు.. దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అవుతోంది ప్రతీ ఒక్కరికి. సూర్యుడు నడినెత్తిన బ్రేక్‌డ్యాన్స్‌ చేస్తున్నట్లు ఉంది సీన్. 8 ఇలా కొట్టిందో లేదో.. సూర్యుని ప్రతాపం స్టార్ట్ అవుతోంది. జనాల మీద నిప్పులు కక్కుతున్నాడు భానుడు. రోహిణి కార్తెలో రొళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న సామెత నిజమే అనిపిస్తోంది. నిజానికి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఇలాంటి ఎండలు ఉంటాయ్.

CHANDRABABU NAIDU: పెన్షన్లపై చంద్రబాబు లేఖ.. ఆడుకుంటున్న జనాలు..

ఐతే సూర్యుడు ముందుగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు క్రియేట్‌ అవుతున్నాయ్. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్‌ నమోదవుతున్నాయ్. ఈజీగా 40 డిగ్రీలు దాటుతున్నాయ్. గతేడాది ఇదే సమయానికి హైదరాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా నగరం భగభగమంటోంది. గురువారం నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారడం ఖాయం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని డాక్టర్లు చెప్తున్నారు.

చిన్న పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్‌తో పాటు గొడుగు, కళ్ళకి గాగుల్స్, కాటన్ దుస్తులను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. ఇక మండుతున్న ఎండలు, ఇబ్బంది పెడుతున్న ఉక్కపోతలతో.. జనం అల్లాడిపోతున్నారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి అన్న ఆలోచనే.. జనాలను మరింత భయపెడుతోంది.