Sunita Williams : ISSలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఇక భూమి మీదకు రారా ?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సునీతా విలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా ? నాసా తాజాగా ఏం చెప్పింది ? అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది ?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సునీతా విలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా ? నాసా తాజాగా ఏం చెప్పింది ? అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది ? సునీతా విలియమ్స్‌తో టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకున్నారు. ఈ నిరీక్షణ ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ఎటువంటి నిర్ధారణ చేయలేదు. టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌తో కలిసి జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లాడు.

వీరిద్దరూ వెళ్ళిన మిషన్ ఒక వారం మాత్రమే అంతరిక్షంలో ఉండాలి. కక్ష్యలో ఉన్న ల్యాబ్‌ను సందర్శించాలి. అయితే అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్‌ల వైఫల్యం కారణంగా వీరిద్దరూ అక్కడ చిక్కుకుపోయారు. నెల రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌కు సంబంధించిన ఒక అప్‌డేట్ వచ్చింది. నాసా చాలా నిరాశాజనకమైన వార్తని వినిపించింది. వ్యోమగాములు, బోయింగ్ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి తిరిగి రావడానికి ఇంకా తేదీని నిర్ణయించలేదని నాసా తెలిపింది. సునీతా విలియమ్స్‌తో టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకున్నారు.

ఈ నిరీక్షణ ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ఎటువంటి నిర్ధారణ చేయలేదు. బోయింగ్ క్యాప్సూల్ సమస్యలను తొలగించడం కోసం టెస్ట్ పైలట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌ కలిసి తమ పనిని పూర్తి చేసే అంతరిక్షంలో ఉండవలసి ఉంటుందని నాసా అధికారులు తెలిపారు. ఇంజనీర్లు గత వారం న్యూ మెక్సికో ఎడారిలో స్పేర్ థ్రస్టర్‌పై పరీక్షను పూర్తి చేశారు. డాకింగ్ సమయంలో ఏ తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో హీలియం లీక్, థ్రస్టర్ పేలవమైన సీల్ కారణంగా అన్ని సమస్యలు సంభవించాయని.. అయితే తర్వాత ఏం చేయాలి అనే విషయంపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.