Supreme Court: అత్యాచారం వల్ల వచ్చే గర్భాన్ని తొలగించుకేనేందుకు అనుమతించిన సుప్రీం కోర్ట్

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్. దీని తీర్పులను ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా గౌరవించాల్సిందే. అయితే తాజాగా గుజరాత్ హై కోర్ట్ దీనిని దిక్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 02:59 PM IST

ఆడపిల్ల గర్భం దాల్చడం అనేది అదృష్టంగా భావిస్తారు. తల్లికే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా ఇది ఎంతో ఆనందకరమైన పరిణామం. అయితే ఇది వివాహం తరువాత చట్టబద్దంగా తల్లి అయితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. తాను స్వేచ్ఛగా ఒక బిడ్డకి జన్మనివ్వొచ్చు. అదే పెళ్లికి ముందే తల్లి అయితే ఈ స్త్రీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. పైగా ఆమె భవిష‌్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిని గమనించిన సుప్రీం కోర్ట్ ధర్మాసనం సంచలనమైన తీర్పునిచ్చింది.

గుజరాత్ లో 25 ఏళ్ల మహిళ పై సామూహిక అత్యాచారం జరిగింది. దీని పర్యావసానంగా ఆమె ఆరువారాల గర్భాన్ని దాల్చింది. దీనిని విచ్ఛితికై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా ఆమె కేసును సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది. అయితే కొన్ని వైద్య రిపోర్టుల కోసం 12 రోజులు కేసును వాయిదా వేసింది గుజరాత్ హై కోర్టు. వాయిదాల పర్వం ప్రతి ఒక్క సందర్భంలో మంచిది కాదు అన్న విష‍యం ఇప్పుడు గుర్తించాలి. ఇక్కడ ఒక్కరోజు ఆలస్యం అయినా కడుపులో పిండం దినదినాభివృద్ది చెందుతుంది. దీనిని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్ట్ వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక గద్యంతరం లేకుండా సుప్రీం కోర్టుకు ఆశ్రయించిన బాధిత యువతికి న్యాయం చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఆమె తక్షణమే ఆసుపత్రిలో చేరి తన గర్భాన్ని విచ్ఛితి చేసుకోవచ్చని తెలిపింది. విచ్ఛితి సమయంలో పిండం సజీవంగా ఉంటే ఇంక్యూబేసషన్ లో ఉంచి సంరక్షించాలని సూచించింది. ఈ బిడ్డ తన ప్రమేయం లేకుండా జన్మనిచ్చిన కారణంగా భవిష్యత్తులో ఈ బిడ్డవల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఈ పసిబిడ్డ యోగక్షేమాలు చూసుకోవాలని తీర్పు వెలువరించింది.

సాధారణంగా ఆడపిల్ల లైంగికదాడికి గురి కావడమే బాధాకరం అంటే గర్భం దాల్చడం ఆమె శారీరక వేదనతోపాటూ మానసికంగా కూడా తీవ్రప్రభావం పడుతుంది. ఈమె పరిస్థితిని అర్థం చేసుకున్న జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ రకంగా వ్యాఖ్యానించింది.