Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ విచారణ వాయిదా

లిక్కర్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 06:36 PM IST

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లిక్కర్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.

Epuri Somanna: కాంగ్రెస్‌లోకి ఏపూరి సోమన్న.. ఎన్ని పార్టీలు మారుతావన్నా..!

ఈ అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇతరులతో కలిసి కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈడీ అందించిన వివరాల ప్రకారం.. మద్యం పాలసీని రూపొందించడంలో, దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణంలో పాల్గొన్నారని కోర్టు పేర్కొంది. అందుకే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ నెల 10న కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జిలు.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రాథమిక వివరాలు పరిశీలించిన అనంతరం కేసు విచారణ.. ఈ నెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మరోవైపు కేజ్రీవాల్‌కు విధించిన 14 రోజుల జుడీషియల్ రిమాండ్ సోమవారంతో ముగియనుంది. దీంతో ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేజ్రీవాల్.. తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.