Amaravathi: రాజధాని రైతులకు షాకిచ్చిన సుప్రీం.. ఆర్‌5 జోన్‌ గురించి ఎందుకింత రచ్చ..

ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యవహారంలో సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ తీర్పు ఇచ్చింది. సుప్రీ నుంచి ఇలాంటి తీర్పును రాజధాని రైతులు అసలు ఎక్స్‌పెక్ట్‌ చేసి ఉండరు. పేదలకు ఆర్‌5 జోన్‌లో ఇళ్ల పట్టాలిస్తామంటూ ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్‌కు సుప్రీం కోర్ట్‌ ఓకే చెప్పింది. వెంటనే పట్టాలు పంపిణీ చేసుకోవచ్చిన చెప్పింది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 04:54 PM IST

దీంతో ఏపీ ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమౌతోంది. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని రాజధాని నిర్మించేందుకు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా స్థానిక ప్రజల నుంచి తీసుకున్నారు. కానీ తరువాత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్‌ సీఎం ఐన వెంటనే రాజధానిగా అమరావతి ఉండబోదని ప్రకటించారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చాడు. రాజధాని కోసం సేకరించిన ప్రాంతాన్ని పేద ప్రజలకు పంపిణీ చేస్తామంటూ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మొత్తం ప్రాంతాన్ని 5 జోన్లుగా డివైడ్‌ చేశారు. ప్రస్తుతం గ్రామాలు ఉన్న ప్రాంతాన్ని ఆర్‌1 గా గుర్తించారు. తక్కువ ఇళ్లు ప్రాంతాన్ని ఆర్‌2గా డివైడ్‌ చేశారు. మధ్య స్థాయిలో నిర్మాణాలు ఇళ్లు ఉన్న ప్రాంతాన్ని ఆర్‌3గా చేశారు. హైడెన్సిటీ జోన్‌ను ఆర్‌4 జోన్‌గా ప్రకటించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలను నివాస ప్రాంతాలుగా గుర్తించి దాన్ని ఆర్‌5 జోన్‌గా ప్రకటించారు.

రాజధాని కోసం తమ నుంచి భూములు తీసుకుని స్థానికేతరులకు ఎలా కేటాయిస్తారనే ఇప్పుడు రాజధాని రైతులు రెయిజ్‌ చేస్తున్న పాయింట్‌. ఇదే పాయింట్‌తో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు రాజధాని రైతులు. ప్రభుత్వం చర్యను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని చెప్పింది. దీంతో ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా సీఆర్‌డీఏ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్‌డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల పేరుతో స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని భూములను టౌన్‌షిప్​ల పేరుతో అమ్ముకోవటానికి, ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అధికారాలు వస్తాయి. దీంతో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిల్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం భూములు పంచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రేపటి నుంచి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.