కలకత్తా రేప్ కేసు ఘటనకు సంబంధించి సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది నేడు. సీబీఐ సీల్డ్ కవర్ లో నివేదికను సుప్రీం కోర్ట్ ముందు ఉంచింది. నివేదిక స్టేటస్ రిపోర్ట్ పరిశీలించిన సుప్రీంకోర్టు… ఇరు వర్గాల వాదనలు విన్నది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు మా చేతికి అందింది అని సిబిఐ తరుపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ పేర్కొన్న్నారు. అప్పటికే చాలావరకు మార్చేశారు అని సొలిసిటర్ జనరల్ కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగింది అనిబెంగాల్ ప్రభుత్వం తరఫున లాయర్ కోర్ట్ ముందు తన వాదన వినిపించారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసారని సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారు అని సిబిఐ తరుపున లాయర్ కోర్ట్ ముందు ఉంచారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారన్నారు.
వాదనలు విన్న అనంతరం బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఘటన తర్వాత వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పోస్టుమార్టం జరిగిన తర్వాతనే ఘటనాస్థలాన్ని సీల్ చేశారు అని సాయంత్రం గం. 6-7 మధ్య పోస్టుమార్టం జరిగిందని బెంచ్ అభిప్రాయపడింది. ఆ తర్వాతనే విచారణ ప్రారంభమైందని అనగా… 5వ రోజు సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని అప్పటి వరకు స్థానిక పోలీసులు దర్యాప్తు జరిపారని కోర్ట్ కు బెంగాల్ ప్రభుత్వ తరుపున లాయర్ వివరించారు.