Supriya Shrinate: కంగనాపై అనుచిత వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనాట్‌ టిక్కెట్ రద్దు

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఆమెకు ఇచ్చిన టిక్కెట్‌ను వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆమె స్థానంలో వీరేంద్ర చౌదరి పేరు ప్రకటించింది. టిక్కెట్‌ రద్దు చేయడానికి కంగానాపై సుప్రియ అభ్యంతరకర వ్యాఖ్యలే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 05:56 PM IST

Supriya Shrinate: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనాట్‌ టికెట్‌ రద్దయింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఆమెకు ఇచ్చిన టిక్కెట్‌ను వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆమె స్థానంలో వీరేంద్ర చౌదరి పేరు ప్రకటించింది. టిక్కెట్‌ రద్దు చేయడానికి కంగానాపై సుప్రియ అభ్యంతరకర వ్యాఖ్యలే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CHIRANJEEVI: వైరల్ ట్వీట్.. బెంగుళూరులో నీటి సమస్యపై చిరు రియాక్షన్

ఆమె మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియ ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరి చేతిలో ఓడిపోయారు. ఈసారి మాత్రం వీరేంద్ర చౌదరిని నిలబెట్టింది. సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలని కోరారనీ.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటున్నారు సుప్రియ. తానే వేరే అభ్యర్థి పేరు పార్టీకి సూచించినట్టు చెబుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్‌కు చెందిన 14 మంది అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో సుప్రియాకు టికెట్ రద్దు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సినీ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమెను ఉద్దేశించి.. సుప్రియా తన సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌తో సహా దేశమంతటా దీనిపై వివాదం చెలరేగింది. పైగా ఉత్తరప్రదేశ్‌తో పాటు, హిమాచల్ ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌పై ఆ ప్రభావం పడింది.

తాను అభ్యంతరంగా ఏ పోస్ట్ చేయలేదని అంటూనే దాన్ని తొలగించినట్టు చెప్పుకున్నారు సుప్రియ. కాగా.. సుప్రియ పోస్ట్ తనను బాధించిందని కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి మహిళను గౌరవించాలనీ.. ఆమె వేశ్యతో సహా ఏ వృత్తిలో ఉన్నా గౌరవించాలనీ.. నాకు చాలా బాధ కలిగించింది అన్నది కంగనా. X లో సుప్రియాని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది కంగనా. తాను ఎన్నో మంచి పాత్రల్లో నటించినట్టు చెప్పింది. సుప్రియా ట్వీట్స్‌పై బీజేపీతో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు ఎన్నికల సంఘం కూడా సుప్రియకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ కామెంట్స్ మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘన కిందకి వస్తాయనీ.. షోకాజ్ నోటీసులపై మార్చి 29 సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది.