Summer : తెలుగు రాష్ట్రాల్లో సుర్రుమనిపిస్తున్న సూరీడు..

మొన్నటి దాక చలితో పల్లె నుంచి పట్నం దాక అందిరిక వణికించిన వాతావరణం.. మాడులు పగలగెట్టేందుకు సిద్ధం అవుతుంది. మార్చి నెల రాక ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల ఆరంభం నుంచే ఉష్ట్రోగ్రతలు క్రమం క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్తరాదిలో తీవ్ర తీవ్రంగా మంచు కురుస్తుండడంతో.. ఇక్కడ దక్షిణాదిలో ఎండలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి.

మొన్నటి దాక చలితో పల్లె నుంచి పట్నం దాక అందిరిక వణికించిన వాతావరణం.. మాడులు పగలగెట్టేందుకు సిద్ధం అవుతుంది. మార్చి నెల రాక ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల ఆరంభం నుంచే ఉష్ట్రోగ్రతలు క్రమం క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్తరాదిలో తీవ్ర తీవ్రంగా మంచు కురుస్తుండడంతో.. ఇక్కడ దక్షిణాదిలో ఎండలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణం కంటే 3 నుంచి 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప జిల్లాల్లో 38 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad) లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల (Temperatures) తో నగరవాసులు ఉకిరిబికిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు మండిపోతుండటంతో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల్లో గ్రేటర్‌ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు, సరూర్‌నగర్‌, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజులపాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో నేడు హైదరాబాద్ లో వాతావరణం ఉదయం నుంచి కాస్తా చల్ల ఉంది.

ఇక ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి ఎండల ప్రభావం బాగా పెరుగుతోందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలంగా ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ లెక్కగడుతోంది. సాధారణంగా ఫిబ్రవరి నెలలో చిరుజల్లులు కురుస్తూంటాయి దీంతో పగటి ఉష్ణోగ్రతల్లో చురుకుదనం ఉండదు.