Suriya ,Jyothika : జిమ్‌లో సూర్య-జ్యోతిక

సౌత్ ఇండస్ట్రీలో (South Industry) మోస్ట్ లవబుల్ కపుల్స్ (Most lovable couple) లో హీరో సూర్య.. జ్యోతిక (Jyotika) జంట ఒకటి. తమిళ్ సినీ పరిశ్రమలో వీరి జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

సౌత్ ఇండస్ట్రీలో (South Industry) మోస్ట్ లవబుల్ కపుల్స్ (Most lovable couple) లో హీరో సూర్య.. జ్యోతిక (Jyotika) జంట ఒకటి. తమిళ్ సినీ పరిశ్రమలో వీరి జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి గొడవ కూడా లేకుండా చాలా అన్యోన్యంగా పిల్ల పాపలతో తమ జీవితాన్ని హాయిగా ముందుకు సాగిస్తున్నారు. ఇక పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదు అని సూర్య ఫ్యామిలీ జ్యోతికకు కండిషన్ పెట్టినప్పటికీ సూర్యను ఒప్పించి మళ్ళీ సినిమాల్లో కొనసాగుతోంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది జ్యోతిక. తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా.. ఇప్పుడు ఆమె బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో బిజీ నటిగా మారిపోయింది. ఇక ఇంత వయసు వచ్చినా కూడా జ్యోతిక యంగ్ హీరోయిన్లకు తన అందంతో పోటీ చేస్తుంది.తాజాగా ఈ ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళ స్టార్ హీరో సూర్యకి ఫిట్‌నెస్ అంటే ఎంత పిచ్చో చెప్పక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకూ అదే లెవల్లో బాడీని మెయింటైన్ చేస్తున్నారు సూర్య. ఇక తాజాగా తన భార్య హీరోయిన్ జ్యోతికతో కలిసి సూర్య జిమ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరూ ఒకరితో ఒకరూ పోటీ పడుతూ కసరత్తులు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇద్దరూ వేరే లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కంగువా సినిమా కోసం సూర్య తెగ కష్టపడుతున్నాడు. ఈ మూవీలో తన రోల్ ఎంతో రౌద్రంగా కనిపించబోతుంది. ఇందుకోసం ఆయన కండలు పెంచుకుంటున్నారు. అందుకోసం జిమ్ లో ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తున్నట్లు సమాచారం. ఎప్పుడూ భర్తకు సాయంగా ఉండే జ్యోతిక జిమ్ లో సూర్యకు సహాయం అందిస్తుంది. సూర్యతో పాటు ప్రతి వర్క్ ఔట్ చేస్తూ భర్తకు స్పిరిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నావని కొందరు.. వావ్.. పర్ఫెక్ట్ కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు