Kim Jong Un: క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కిమ్ జాంగ్ ఉన్.. తాజాగా ఏం చేశాడో తెలుసా..?

కిమ్ జాంగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నడన్న అనుమానం రావడంతో ఒక అధికారి కాళ్లు, మెడ, చేతులు నరికి చేపల ట్యాంకులో వేసి ఉరి తీసినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - October 17, 2023 / 09:16 AM IST

ఉత్తర కొరియా.. ఈ పేరు చెబితే ప్రపంచ దేశాలు ఒణికిపోతాయి. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ – జాంగ్ – ఉన్. రాచరికం ద్వారా తన తాత, తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారు. చూసేందుకు ఐదడుగుల కటౌటే అయినా చేసేవన్నీ క్రూరమైన పనులే. ఈయనకు ఎదురు తిరిగినందుకు తన సొంత మామను కుక్కల బోనులో వేసి చంపించాడు. అడ్డు వచ్చిన అత్తకు విషం ఇచ్చి ప్రాణాలు తీశాడు. చూశారుగా ఈయన ఇంట్రడెక్షన్ ఎంత ఘోరంగా ఉందో. ఇక లైఫ్ స్టైల్లోకి వెళితే..

హెయిర్ స్టైల్ నిబంధన..

ఇక ఉత్తర కొరియాలో జరిగే ఏ వార్తలు ప్రపంచానిక తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈయన గురించి వచ్చే వార్తలు కూడా కొందరు జర్నలిస్ట్లు రహస్యంగా పరిశోధనలు జరిపి సేకరిస్తారు. వాటిని ప్రసారం చేసేందుకు కూడా భయపడుతూ ఉంటారు. గతంలో తన కటింగ్ కి సంబంధించి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ దేశాలను గడగడలాడించే కిమ్ జాంగ్ కు బార్బర్స్ అంటే భయం అంట. అందుకే తన జుట్టును తానే కత్తిరించుకుంటారు. ఆ దేశంలో కటింగ్ పై కొన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఒక్కో వయసు వారికి ఒక్కో రకమైన హెయిర్ స్టైల్ ఉంటుంది. మగవాళ్ళంతా తన హెయిర్ స్టైల్ ను, ఆడవాళ్లంతా తన భార్య రిసోల్ – జు హెయిర్ స్టైల్ ను పాటించాల్సిందే.

పదేళ్ల పాలన..

గతంలో ఎలాంటి అనుభవం లేకుండా సైన్యాధక్ష్యుడుగా వ్యవహరించారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా అన్న విధంగా తన ఆధీనంలోని మిలరటీకి కమాండర్ గా కొనసాగాడు. తన దేశంలో కేవలం నాలుగే టీవీ ఛానెళ్లు ఉంటాయి. వాటినే ప్రజలు చూడాలి. పైగా తన గురించి మాత్రమే అందులో ప్రసారం చేస్తూ ఉంటారు. ఇలాంటి కఠినమైన ఆంక్షలను పెడుతూ ప్రజలను బానిసలుగా చేసి పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పదేళ్లు పాలించాడు కిమ్. ఇతనికి వ్యతిరేకంగా ఎవరు పావులు కదిపినా వారిని అత్యంత కిరాతకంగా చంపించేస్తారు. ఈయన పాలనలో ప్రజలు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తూ కన్నీళ్లు మింగి బ్రతుకుతున్నారు.

దుస్తులపై ఆంక్షలు..

గతంలోనే అతని మూర్ఖత్వానికి పరాకాష్టగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తర కొరియాలో నివసించే ప్రజలు టైట్ జీన్స్ వేయకూడదని, స్టైల్ గా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. క్యాపిటలిస్టిక్ జీవన విధానం కొరియా యువతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందుకే పాప్ కల్చర్ ను బ్యాన్ చేశారు. అలాగే ఈ దేశంలో పుట్టిన పిల్లలకు గన్, బాంబు కల్చర్ ఉట్టిపడేలా వాటి పేర్లు పెట్టాలని ఆదేశించారు. వీటని ఎవరైనా అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

మెడ, కాళ్లు నరికి ఉరి..

గతంలో తన తండ్రి చనిపోయిన సందర్భంగా 11 రోజులు సంతాప సభ ఏర్పాటు చేసి సరికొత్త రూల్స్ ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నవ్వడం, షాపింగ్ చేయడం, మద్యపానం నిషేధించి, పుట్టిన రోజులు జరుపుకోకూడదు అని ఆదేశించారు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు నిర్వహించకూడదని, వాటిల్లో పాల్గొనకూడదని ఆదేశించారు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆర్డర్ వేశారు. తాజాగా తనపై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడని అనుమానం రావడంతో అతనిని క్రూరంగా హతమార్చాడు. ఒక అధికారి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని తెలియడంతో ఫిరానా అనే క్రూరమైన చేపల ట్యాంకు ఉరివేసి చంపేశాడు. ఇలా ట్యాంకులో వేసే ముందు అతని మెడ, కాళ్లు, చేతులు కత్తితో నరికి శరీరాన్ని దారంతో కట్టి ఫిష్ ట్యాంకులో వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

T.V.SRIKAR