T CONGRESS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్, గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 5 అంశాల ఎజెండాగా ఈ పీఏసీ సమావేశం సాగింది.
YS JAGAN: మేనల్లుడిని కూడా పట్టించుకోని జగన్.. టార్గెట్ అంతా దాని మీదే..
ఇందులో తాజా ఎన్నికల ఫలితాలు, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల్లో అనసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గడంపై కూడా చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేశారు. గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేయాలని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయించారు. తమకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నాయకులకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. వీరిలో సీఎంతోపాటు దాదాపు అందరూ మంత్రులే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలు వీళ్లే..
చేవెళ్ల, మహబూబ్‌నగర్: సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్, హైదరాబాద్: భట్టి విక్రమార్క
నాగర్‌కర్నూల్: జూపల్లి కృష్ణారావు
నల్గొండ: ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్: కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్: సీతక్క
పెద్దపల్లి: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్: పొన్నం ప్రభాకర్
నిజామాబాద్: జీవన్ రెడ్డి
జహీరాబాద్: పీ సుదర్శన్ రెడ్డి
మెదక్: దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి: తుమ్మల నాగేశ్వర రావు