Ayodhya Ram Mandir : చెప్పులు తీసేసి.. గుండె మీద చేయి పెట్టుకొని.. రాముడి సూర్యతిలకం చూసి మోదీ భావోద్వేగం..

అయోధ్య (Ayodhya ) లో అద్భుతం జరిగింది. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం (Surya Tilak) .. మరో ప్రపంచంలోకి లాకెళ్లింది భక్తులను. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా.. బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు.

అయోధ్య (Ayodhya ) లో అద్భుతం జరిగింది. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం (Surya Tilak) .. మరో ప్రపంచంలోకి లాకెళ్లింది భక్తులను. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా.. బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు. కొద్దిక్షణాలు మాత్రమే ఆవిష్కృతమైన ఈ అద్భుత సమయంలో.. దగదగా మెరిసిపోతున్న రామయ్య దివ్యమంగళ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. సూర్య భగవానుడు దిద్దిన తిలకం చూసి భక్తకోటి పులకించిపోయింది.

ఈ సుందర దృశ్యాన్ని చూసి.. ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అసోంలో ఎన్నికల ప్రచారానికి హాజరైన మోదీ.. అయోధ్యలో అద్భుత ఘట్టాన్ని నేరుగా చూడలేకపోయారు. ఎన్నికల షెడ్యూల్‎లో బిజీగా ఉన్నా.. తిరుగు ప్రయాణంలో తన ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు మోదీ. ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో బాలరాముడిపై సూర్య కిరణ తిలకాన్ని చూసి మురిసిపోయారు. ఆ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన చేతిని హృదయంపై ఉంచి కాళ్లకు ఉన్న బూట్లను తీసి పక్కన పెట్టి.. బాలరాముడిని మనసా, వాచా, కర్మణా స్మరిస్తూ కొన్ని క్షణాలు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ.

యావత్ ప్రపంచం ఈ మహాద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని. ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే చాన్స్‌ లేకపోయినా.. సోషల్‌మీడియాలో లైవ్‌లో చూడడం ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. సూర్యతిలకం… వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నాని ఎమోషనల్ అయ్యారు మోదీ.