తెలంగాణ రెండోవ.. తొలి మహిళ గవర్నర్ (వివాదాల గవర్నర్‌గా పేరు సంపాదించుకున్న) తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..
దీంతో తెలంగాణ కు నూతన గవర్నర్ గా జార్ఖండ్ (Jharkhand) గవర్నర్ ను లెఫ్టెనెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం (Central Govt) నియమించింది.
ఇవ విషయంలోకి వెలితే.. లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు మారడం సర్వసాధారణం.. కానీ గవర్నర్లు కూడా మారడం అసాధారణం.. అది కూడా బీజేపీ పార్టీలో వివిధ పదవులు అనుభవించి వారు కావడం గమనార్హం..
ఇక పోతే తెలంగాణ తొలి మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ తమిళ నాడు రాష్ట్రానికి చెందిన వారే.. కానీ నరసింహన్ మాత్రం రాజకీయ నేత కాదు.. 1968 లో తను భారత దేశానికి పోలీసు సేవలందించారు. అనంతరం ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ తర్వాత.. ఛత్తీఘడ్ మూడోవ గవర్నర్ గా సేవలందించారు.
తెలంగాణ రెండోవ గవర్నర్ తమిళిసై గవర్నర పదవికి రాజీనామ చేశారు. దాదాపు సంవత్సర నుంచి ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పలు మార్లు అధికారికంగా వ్యాఖ్యనించింది. ఇక ఎట్టకేలకు గవర్నర్ పదవికి రాజీనామ చేసి మళ్లీ బీజేపీ పార్టీలో చేరి ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వ్యూహాలను రచిస్తుంది. తెలంగాణ రెండోవ.. తొలి మహిళ గవర్నర్ తమిళి సై తమిళ రాష్ట్రానికి చేందినవారు. అందులోనూ బీజేపీ జాతీయ కార్యదర్శిగా.. తమిళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా.. పలు మార్లు బీజేపీ తరఫున ఎంపీ, ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ మూడో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు.. రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా సేవలందించారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యారు. 2024 మార్చ్ 20న తెలంగాణ మూడోవ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.
S.SURESH