Tamil Nadu: అప్పు తీర్చండి స్వామీ.. దేవుడికి ఓ భక్తుడి లెటర్..

తమిళనాడులో ఓ భక్తుడు దేవుడినే డబ్బులు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టాడు. తన అప్పులు తీర్చాలంటూ లెటర్ రాసి.. దాన్ని హుండీలో వేయడంతో ఆ లెటర్ వైరల్ అవుతోంది. అందులో ఆ భక్తుడు తనకున్న అప్పుల వివరాలన్నీ రాశాడు.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 02:24 PM IST

Tamil Nadu: చాలామంది తమ సమస్యలన్నీ దేవుడికి ఏకరువు పెడుతుంటారు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి.. ఉద్యోగం రావాలి.. పెళ్లవ్వాలి.. ఇలా రక రకాల కోరికలు కోరుకొని దేవుడికి మొక్కుకుంటారు. ఆ కోరికలు తీరిపోతే మళ్ళీ వెళ్ళి మొక్కులు కూడా తీర్చుకుంటారు. హుండీలో కానుకలు వేస్తుంటారు. కానీ తమిళనాడులో ఓ భక్తుడు దేవుడినే డబ్బులు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టాడు. తన అప్పులు తీర్చాలంటూ లెటర్ రాసి.. దాన్ని హుండీలో వేయడంతో ఆ లెటర్ వైరల్ అవుతోంది.

RAM GOPAL VARMA: టీ గ్లాస్‌ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్

తమిళనాడులో ఓ భక్తుడు దేవుడిని వింత కోరిక కోరాడు. దేవుడికి దండం పెట్టుకొని మోకరిల్లి, మాత్రం అడగలేదు. తన కోరికల చిట్టాను ఓ లెటర్లో రాసి, ఆ లెటర్‌ను ఆలయం హుండీలో వేశాడు. అందులో ఏముంది అంటే.. తన అప్పులన్నీ తీర్చాలంటూ దేవుడికి రాశాడు ఆ భక్తుడు. ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో ఆ లెటర్ బయటపడింది. దాన్ని చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. తమిళనాడులోని ధర్మపుడి కుమారస్వామిపేటలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఆలయ సిబ్బంది హుండీలోని కానుకలను లెక్కించడం కోసం తెరవవడంతో ఈ లెటర్ బయటపడింది. అందులో ఆ భక్తుడు తనకున్న అప్పుల వివరాలన్నీ రాశాడు. అవన్నీ తీర్చాలని కోరుతూనే.. దేవుడిని ప్రసన్నం చేసుకోడానికి శ్లోకాలు కూడా లెటర్లో రాశాడట. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తుడు తనకు కోటి రూపాయల అప్పు ఉందనీ.. దాన్ని తీర్చాలని స్వామిని కోరుకున్నాడు.

అందులో ఎవరికి ఎంత ఇవ్వాలో, గోల్డ్ లోన్, యూనియన్ లోన్, హౌస్ లోన్ అంటూ తనకు ఉన్న అప్పుల వివరాలన్నీ డిటైల్డ్‌గా రాశాడు. మొత్తం కలిపి కోటి రూపాయల దాకా అప్పులు ఉన్నాయి. స్వామీ నువ్వే వాటిని తీర్చాలి.. నా సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నాడు. ఈ లెటర్ మీద పేరు లేకపోవడంతో ఎవరు రాశారో తెలియలేదంటున్నారు ఆలయ సిబ్బంది. అయితే ఇది చదివిన వాళ్ళు కొందరు జాలిపడుతున్నారు. మరికొందరు మాత్రం.. నువ్వు అప్పులు చేసేటప్పుడు దేవుడికి చెప్పిచేశావా? ఆయనెందుకు తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. సరే జనం మాట ఎలా ఉన్నా.. మరి దేవుడు ఆ భక్తుడిని కరుణిస్తాడా? లేదో..!