TCS Jobs Recruitment: టీసీఎస్ నుంచి ఒక శుభవార్త.. మరో చేదు వార్త

ముంబైకి చెందిన టీసీఎస్ కంపెనీలో లంచగొడ్డులను గుర్తించినట్లు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో సుమారు 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. అందులో 16 మందిని విధుల నుంచి బహి‎ష్కరించగా ముగ్గురిని రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 01:15 PM IST

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో గత నాలుగు నెలల క్రితం నియామకాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై దృష్టి సారించిన సంస్థ లోతైన దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ జూన్ నుంచి అక్టోబర్ వరకూ అన్ని శాఖల్లో పరిశోధన జరిపింది. సుమారు 19 మంది లంచాలకు మరిగి ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించింది. వారిని వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆదివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

మేనేజర్ పాత్ర ఏమీ లేదు..

ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించింది కంపెనీ షేర్స్ ని అమ్మకాలు జరిపేవారిగా గుర్తించింది. ఇలా తమ షేర్స్ ను సేల్ చేసే యాజమానులతో ఎలాంటి ఒప్పందాలు కొనసాగించకుండా రద్దు చేసింది. వీరే ఉద్యోగాల నియామకాల్లో కొత్తవారిని చేరిపించేందుకు లంచాలు తీసుకుని అవకతవకలకు పాల్పడినట్లు గతంలో కొందరు ఆరోపణలు చేశారు. ఈ ప్రథమిక సమాచారం ఆధారంగానే దర్యాప్తును చేపట్టింది ఈ సంస్థ. టీసీఎస్ లో జరిగిన స్కాములో మేనేజర్ స్థాయి వ్యక్తుల పాత్ర ఏమీ లేదని తేల్చింది. పైగా ఈ సంస్థకు ఎలాంటి సంబంధం కూడా లేదని స్ఫష్టం చేసింది. గతంలో జరిగిన ఇలాంటి చట్టవిరుద్దమైన కార్యకలాపాల వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పాలనా విధానంలో మార్పులను తీసుకొచ్చింది. హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామని పేర్కొంది. ప్రస్తుతం పనిచేసే ఉద్యోగులు సహా తమ కంపెనీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ టాటా గ్రూప్ నియమ నిబంధనలను పాటించాల్సిందే అని ఆదేశాలను జారీ చేసింది.

కంపెనీ స్థితి ఇలా..

ఇకపోతే ప్రస్తుతం కంపెనీ ఒకేరకమైన నికర లాభాన్ని గణిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తాజా త్రైమాసికానికి అంటే జూలై – సెప్టెంబరు వరకూ రూ. 11,342 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ ను సాధించినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి వచ్చిన లాభాలతో పోలిస్తే రూ. 10,431 కోట్లు ఎక్కువ అంటే 8.7 శాతం అధికం అని వెల్లడించింది. వీటిని ప్రకటించే తరుణంలో తన కంపెనీ ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న 6 లక్షల మందికిపైగా ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయవల్సిందిగా కోరింది. వర్క్ ఫ‌్రం హోమ్ అనే ఆఫ్షన్ ను తొలగించినట్లు పేర్కొంది. గతంలో నియామకాలు చేపట్టి నియామక పత్రాలను అందించిన వారికి తప్పకుండా విధుల్లో చేర్చుకుంటామని.. ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం జరిగినప్పటికీ తప్పకుండా అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 40వేల మంది ఫ్రెషన్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

T.V.SRIKAR