TDP-YSRCP: ఏపీలో ఎన్నికల నగారా మోగేందుకు దాదాపు సమయం ఆసన్నమైంది. మార్చి ఆఖరి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు మేనిఫెస్టో వరకూ నిద్రాహారాలు మాని మరీ ప్రచారం చేస్తున్నాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలు, విమర్శలకు ప్రతి విమర్శలతో.. ఏపీ రాజకీయం హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ప్రత్యర్థి పార్టీల కంటే తామే ముందుండాలనే ఆరాటంలో ఏపీ రాజకీయ నాయకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు.
YS SHARMILA: అధికారంలోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలిచ్చారు.. జగన్‌కు షర్మిల ప్రశ్న
దేశంలో ఎక్కడా లేని విధంగా కండోమ్‌లతో ప్రచారం చేస్తున్నారు. అవును.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కండోమ్‌లు ప్రచార సాధనంగా మారాయి. కండోమ్‌ల గురించి మాట్లాడుకోవడమే ఇబ్బందికరం అనుకునే స్టేజ్ నుంచి ఏకంగా వాటిని ఎన్నికల ప్రచారానికి వాడుకునేస్థాయికి రాజకీయం మారిపోయింది. అగ్గి పుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అనే కవితను ఏపీ పొలిటికల్ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. అందుకే ఓ అడుగు ముందుకేసి కండోమ్ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ కండోమ్స్ కనిపించిన మరుసటిరోజే ఇంటర్నెట్‌లో వైసీపీ కండోమ్స్ కూడా కనిపించాయి. భవిష్యత్తుకు భరోసా పేరుతో టీడీపీ కండోమ్స్ ఉంటే.. సిద్ధం పేరుతో వైసీపీ కండోమ్స్ ఉన్నాయి. అయితే ఈ కండోమ్స్ పంచేది ఎవరు? ఎక్కడ పంచుతున్నారు?
నిజంగా రాజకీయ నాయకులే వీటిని పంచుతున్నారా లేక ఒకరిపై ఒకరు బురద జల్లుకునేందుకు చేస్తున్న ప్రచారమేనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. విషయం ఏదైనా కండోమ్స్‌తో ప్రచారం మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన ప్రజలు కూడా ఇదేం దిక్కుమాలిన ప్రచారంరా నాయనా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే బదులు శవాల మీద పేలాలు ఏరుకుని బతకండి అంటూ చీవాట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోల గురించి అటు టీడీపీ నుంచి గానీ.. ఇటు వైసీపీ నుంచి గాని ఏ నాయకుడు రియాక్ట్ అవ్వలేదు. ఇది నిజంగానే ప్రచారమా లేదా ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనేది చూడాలి.