TDP-BJP-JANASENA: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. ఆ పార్లమెంట్ స్థానం నుంచే పవన్ పోటీ..

అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేనకు 24, బీజేపీకి 6 సీట్లు దక్కుతాయి. పార్లమెంట్‌కు సంబంధించి బీజేపీకి 6, జనసేనకు 2 సీట్లు దక్కనున్నాయి. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 02:55 PM IST

TDP-BJP-JANASENA: ఏపీలో పొత్తు విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం విషయంలోనూ స్పష్టత వచ్చింది. పవన్.. కాకినాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిసింది. మొత్తంగా బీజేపీ-జనసేనకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాల్ని కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి.

KCR: కేసీఆర్ మీద పోలీస్‌ కంప్లైంట్‌.. ప్రణీత్‌ రావు వెనక ఉంది ఆయనేనా..?

ఇందులో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేనకు 24, బీజేపీకి 6 సీట్లు దక్కుతాయి. పార్లమెంట్‌కు సంబంధించి బీజేపీకి 6, జనసేనకు 2 సీట్లు దక్కనున్నాయి. నిజానికి ఇటీవల టీడీపీ-జనసేన పొత్తులు ప్రకటించినప్పుడు జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అయితే, ఇప్పుడు కూటమిలో బీజేపీ చేరడం వల్ల ఒక పార్లమెంట్ స్థానాన్ని జనసేన కోల్పోనుంది. అంటే.. ఇప్పుడు జనసేన 2 పార్లమెంట్ స్థానాల నుంచే బరిలో దిగనుంది. అవి ఒకటి కాకినాడ. రెండు మచిలీపట్నం. వీటిలో కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారు. బీజేపీ పెద్దల సూచనతో పవన్ పార్లమెంట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అసెంబ్లీకి, పార్లమెంట్‌కు.. రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. బీజేపీ సూచనతో పార్లమెంట్ నుంచి పోటీ చేయడంవైపే పవన్ మొగ్గు చూపారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేయబోతున్నారు. కాకినాడలో పోటీకి సంబంధించి.. ఇప్పటికే పవన్ స్పష్టతతో ఉన్నారు. ఈ విషయం గురించి నేరుగా చెప్పకపోయినప్పటికీ.. అక్కడి నేతలతో పవన్ నిత్యం సంప్రదింపులు జరిపారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.

ఇక్కడ జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని సర్వేల్లో తేలింది. పవన్ సామాజికవర్గమైన కాపు ఓట్లు కూడా ఎక్కువే. దీంతో కాకినాడ నుంచి పోటీ విషయంలో పవన్ ఆసక్తితోనే ఉన్నట్లు సమాచారం. బీజేపీ పోటీచేయబోయే స్థానాల విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపూర్ లేదా తిరుపతి పార్లమెంట్ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్‌ , రాజమండ్రి నుంచి పురందేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అరకు లేదా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ‌ కుమార్‌ రెడ్డి లోక్ సభకు పోటీ చేయనున్నారు. అసెంబ్లీ సీట్లకు సంబంధించి కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విశాఖ నుంచి విష్ణు కుమార్ రాజు లేదా పీవీ మాధవ్, శ్రీకాళహస్తి నుంచి కోలా అనంత్, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేయబోతున్నారు. మిగతా స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంది.