TDP-BJP-JANASENA: ఎన్డీయేలోకి టీడీపీ, జనసేన.. పొత్తును ప్రకటించిన బీజేపీ

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినప్పటికీ.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోమవారం సీట్ల విషయంలో ప్రకటన ఉంటుంది.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 08:33 PM IST

TDP-BJP-JANASENA: ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ అధికారిక ప్రకటన చేసింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతోపాటు, బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు విడుదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు జేపీ నద్దా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడు పార్టీలు దేశాభివృద్ధికి, ఏపీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాయని నద్దా తెలిపారు.

Sini Shetty: అందం గీసిన బొమ్మ సినీ శెట్టి.. ఇంతకీ ఎవరీమె.. మిస్‌వరల్డ్ వరకు ఎలా వచ్చింది..?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినప్పటికీ.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోమవారం సీట్ల విషయంలో ప్రకటన ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు, ఎనిమిది పార్లమెంట్ సీట్లను టీడీపీ కేటాయించింది. ఇందులో జనసేనకు 24 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు, బీజేపీకి 6 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయి. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

ఆయన ఎంపీగా గెలిచి, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ, టీడీపీ, జనసేన.. ఉమ్మడిగా సభలకు సిద్ధమవుతున్నాయి. ఈ సభల్లో కొన్నింట్లో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నద్దా.. ఇతర నేతలు కూడా పాల్గొంటారు. అధికార వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనుంది.