జస్టిన్ హిమబిందు నరకానికి వెళ్లాలని ఒకడు పోస్టు పెడితే ఆమె అంతుచూడాలని మరొకడు కామెంట్ చేస్తాడు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 45ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా ఏసీబీ కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందు పేరు మారుమోగింది. న్యాయవ్యవస్థపై సామాన్యుల్లో నమ్మకం కలిగేలా తీర్పునిచ్చారని చాలా మంది అభిప్రాయపడగా.. మరికొందరు మాత్రం విషం కక్కడం మొదలుపెట్టారు.
హిమబిందు కులం ‘రెడ్డి’ అని ఫేక్ పోస్టులు ప్రారంభించిన టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. అంతటితో ఆగలేదు. ఆమెకి సివిల్ జడ్జి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ ప్రచారం చేశారు. తర్వాత అది ఫేక్ అని తేలింది. ఆమె కులం కూడా రెడ్డి కాదని కూడా ప్రూవ్ అయ్యింది. ఈ పరీక్షల్లో హిమబిందు 14వ ర్యాంక్ సాధించారు. మరో ఫేక్ వీడియోలో జస్టిస్ హిమబిందును పోలి ఉన్న ఓ మహిళ చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్నట్టు చూపించారు. దీన్ని కొంతమంది జర్నలిస్టులు కూడా షేర్ చేయడం విడ్డూరం.
ఈ ఫేక్ ప్రచారాలు కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అవ్వలేదు. ఓ మెయిన్‌స్ట్రీమ్ న్యూస్ ఛానెల్‌లో ఓ మేధావి నోటికి వచ్చింది మట్లాడాడు. తీర్పు ఇచ్చిన రోజు జస్టిస్ హిమబిందు ల్యాండ్ లైన్ చాలాసార్లు మోగిందని.. ఆమె కాల్స్‌లో ఎవరితో మాట్లాడారో రికార్డ్స్ కావాలని అడిగారు. నిజానికి చంద్రబాబుకు రిమాండ్ విధించకుండా ఉండి ఉంటే అసలు జస్టిస్ హిమబిందు గురించి చర్చ జరిగి ఉండేది కాదు.. చంద్రబాబు దేవుడని.. ఏ తప్పు చేయలేదని.. అందుకే న్యాయం గెలిచిందని డబ్బా కొట్టేవారు. ఒకవేళ తెలుగుతమ్ముళ్ల ప్రకారం.. ఇది తప్పు తీర్పు అని కాసేపు అనుకుందాం.. అంతమాత్రానా జడ్జిని బూతులు తిడతారా? ఇది విమర్శించే పద్ధతి కానే కాదు కదా..!